Share News

Nara Lokesh: మా పనితీరుకు అదే నిదర్శనం..మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 10 , 2025 | 01:20 PM

Minister Nara Lokesh: గత జగన్ ప్రభుత్వంలో ఏపీలో పెట్టుబడి పెట్టినవాళ్లకు ఇవ్వాల్సిన రాయితీల్లో 50శాతం వాటా అడిగారని కొందరు పారిశ్రామికవేత్తలు తమ దృష్టికి తీసుకు వస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీలో ఇక అలాంటి పరిస్థితులు ఉండవని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.

Nara Lokesh: మా పనితీరుకు అదే నిదర్శనం..మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Minister Nara Lokesh

అమరావతి: ఉపాధ్యాయుల సమస్యలను ఓ క్రమపద్ధతిలో పరిష్కరించామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అంగన్వాడీలకు సంబంధించిన 4 సమస్యలు పరిష్కరించామని అన్నారు. ఈ నెల 19వ తేదీన మల్లవల్లిలో జరిగే అశోక్ లైల్యాండ్ ప్రారంభోత్సవంలో తాను పాల్గొంటున్నానని తెలిపారు. ఏపీకి పెట్టుబడులు ఓ క్రమపద్ధతిలో ఒక్కొక్కటిగా తెస్తున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు.


గత జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టినవాళ్లకు ఇవ్వాల్సిన రాయితీల్లో 50శాతం వాటా అడిగారని కొందరు పారిశ్రామికవేత్తలు తమ దృష్టికి తెస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీలో ఇక అలాంటి పరిస్థితులు ఉండబోవని వారికి హామీ ఇచ్చి ఒప్పిస్తున్నామని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను జగన్ ప్రభుత్వం రూ.4500కోట్లు పెట్టి దిగిపోయిందని ఆరోపించారు. చిక్కీ, గుడ్డు, స్కూల్ కిట్స్‌లో రివర్స్ టెండరింగ్ లేకుండా రూ.1000 కోట్లను తమ ప్రభుత్వం ఆదా చేసిందని తెలిపారు. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌లోనూ నాణ్యత పెంచామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.


ఏపీ జెల్లడ పట్టి నియమిస్తున్న వీసీలే తమకూ కావాలని కేంద్ర ప్రభుత్వం వారిని కోరి తీసుకుపోతోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. మొదటిసారి గెలుపొందిన ఎమ్మెల్యేలకు రాజకీయ శిక్షణ తరగతి కూడా చాలా అవసరమని భావిస్తున్నామని తెలిపారు. కొందరికి ప్రజలకు ఏం చేయాలి, కేడర్‌తో ఎలా ఉండాలో తెలియట్లేదు కాబట్టి పార్టీపరంగా ఓ సెషన్ ఏర్పాటు చేయాలని కోరారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేల్లో ప్రభుత్వ పెద్దలు చెబితే వినేవారే ఎక్కువగా ఉన్నారని మంత్రి నారా లోకేష్ తెలిపారు.


ఎవరూ ఆందోళన చెందొద్దు..

బలహీనవర్గాలకు ఎమ్మెల్సీలుగా ప్రాధాన్యం కల్పించి తెలుగుదేశం పార్టీ వారి పట్ల ఉన్న చిత్తశుద్ధిని మరోమారు చాటుకుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మీడియాతో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్ చేశారు. శాసనమండలిలో గొంతు ఉన్న యువ మహిళలను ప్రోత్సహించేందుకు గ్రీష్మకు అవకాశం కల్పించామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ పట్ల బీదా రవిచంద్ర, బీటీ నాయుడులు చూపిన విధేయత అందరికీ తెలిసిందేనని అన్నారు. దశల వారీగా కష్టపడిన అందరికీ పదవులు వస్తాయని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. బీద రవిచంద్రకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. లోకేష్‌ను మర్యాద పూర్వకంగా బీద రవిచంద్ర కలిశారు. ప్రజాసమస్యలను శాసన మండలి దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు.


ఇవి కూడా చదవండి..

Mandipalli : ఆ లెక్కలు తీస్తా.. మంత్రి మండిపల్లి స్ట్రాంగ్ వార్నింగ్

CM Chandrababu: అవినీతి విషయంలో సహించేది లేదు..

BJP MLC candidate: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమువీర్రాజు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 10 , 2025 | 01:33 PM