Share News

Amaravati: రాజధాని అమరావతికి మరో శుభవార్త.. అసలు విషయమిదే..

ABN , Publish Date - Nov 07 , 2025 | 09:36 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమరావతి డెవలప్‌మెంట్‌కి కావాల్సిన నిధులపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

 Amaravati: రాజధాని అమరావతికి మరో శుభవార్త.. అసలు విషయమిదే..
Amaravati

అమరావతి, నవంబరు7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి (Capital Amaravati)కి మరో రూ. 7,500 కోట్ల రుణం మంజూరైంది. సీఆర్డీఏకి రూ. 7,500 కోట్ల రుణం మంజూరు చేసింది NABFID (National Bank for Financing Infrastructure and Development). ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సమక్షంలో ఇవాళ(శుక్రవారం) సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు రుణ మంజూరు పత్రం అందజేశారు NABFID అధికారులు.


రాజధాని అమరావతి అభివృద్ధి పనులకి ఇప్పటికే సీఆర్డీఏ రూ.26 వేల కోట్ల మేర రుణం తీసుకుంది. ఈ నేపథ్యంలో సీఆర్డీఏకు నిధులు సమకూర్చేందుకు అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ముందుకు వస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

ఎమ్మెస్కే ప్రసాద్‌కు ప్రొటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్

రైతు వ్యతిరేక చట్టాలపై ఎన్జీ రంగా పోరాటం చేశారు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 07 , 2025 | 10:05 PM