CM Chandrababu: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రొటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్
ABN , Publish Date - Nov 07 , 2025 | 08:12 PM
బీసీసీఐ మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు ప్రొటోకాల్ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రొటోకాల్ వివాదంపై టీడీపీ ఎంపీ సానా సతీష్‌పై సీఎం అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగ్గకుండా చూసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, నవంబరు7 (ఆంధ్రజ్యోతి): బీసీసీఐ మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ (MSK Prasad)కు ప్రొటోకాల్ ఇచ్చే వ్యవహారంలో గన్నవరం ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ఎమ్మెస్కే ప్రసాద్‌తో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఈ ఘటన జరగటంపై టీడీపీ ఎంపీ, ఏసీఏ సెక్రటరీ సానా సతీష్‌తోనూ మాట్లాడారు సీఎం చంద్రబాబు. ప్రొటోకాల్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంపై సానా సతీష్‌పై సీఎం అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని ఏసీఏకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
అసలు ఏం జరిగిందంటే..
కాగా, మహిళా వన్డే వరల్డ్ కప్ 2025లో విశ్వవిజేతగా నిలిచిన ఇండియా జట్టులో శ్రీచరణి ఆడిన విషయం తెలిసిందే. అయితే, భారత లైఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీచరణి ఇవాళ (శుక్రవారం) ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు ఈ సమయంలో శ్రీచరణికి ఘనస్వాగతం పలికేందుకు పలువురు ప్రముఖులు వచ్చారు. వారిలో మంత్రులు వంగలపూడి అనిత, సంధ్యారాణి, సవిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), శాప్ అధికారులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెస్కే ప్రసాద్ కూడా గన్నవరం ఎయిర్‌పోర్టుకి వచ్చారు.
ఈ క్రమంలో భద్రత పాటిస్తున్న ఎయిర్‌పోర్టు అధికారులు ఎమ్మెస్కే ప్రసాద్‌ను శ్రీచరణి ఉన్న లాంజ్‌లోకి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్ పాటించాల్సిదేనని ఎయిర్‌పోర్టు అధికారులు స్పష్టం చేశారు. ప్రొటోకాల్ విషయంపై వెంటనే ఎస్పీకి ఎమ్మెస్కే ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఎమ్మెస్కే ప్రసాద్ ఫిర్యాదుతో ఎస్పీ వెంటనే స్పందించారు. అనంతరం ఎమ్మెస్కే ప్రసాద్‌ని శ్రీచరణి లాంజ్‌లోకి అనుమతించారు. అయితే, ప్రొటోకాల్ వివాదాన్ని ఎమ్మెస్కే ప్రసాద్ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) కీలక ప్రతినిధులపై ఎమ్మెస్కే ప్రసాద్ ఆరోపణలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఏసీఏ ప్రతినిధులు కావాలనే తనను అడ్డుకున్నారని ఆయన ఆరోపణలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెస్కే ప్రసాద్ బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ ప్రొటోకాల్ వివాదంపై వెంటనే స్పందించారు. వీఐపీల విషయంలో ఏసీఏ అధికారులు తగిన జాగ్రత్తలు పాటించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అక్టోబర్‌లో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..
ఆలూరులో వైసీపీకి షాక్.. బీజేపీలో భారీగా చేరికలు
Read Latest AP News And Telugu News