Alapati Fires Ysrcp: కర్నూలు బస్సు దుర్ఘటనపై వైసీపీ దుష్ప్రచారం.. ఆలపాటి ఫైర్
ABN , Publish Date - Oct 27 , 2025 | 04:03 PM
శవ రాజకీయాలు చేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు బస్సు దుర్ఘటనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ఘటనలో వైసీపీ, బ్లూ మీడియా అనేక తప్పుడు కథనాలు సృష్టిస్తోందని ఫైర్ అయ్యారు ఆలపాటి రాజేంద్రప్రసాద్.
అమరావతి, అక్టోబరు27 (ఆంధ్రజ్యోతి): శవ రాజకీయాలు చేయడమే వైసీపీ (YSRCP) లక్ష్యంగా పెట్టుకుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ (MLC Alapati Rajendra Prasad) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు బస్సు దుర్ఘటనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ఘటనలో వైసీపీ, బ్లూ మీడియా అనేక తప్పుడు కథనాలు సృష్టిస్తోందని ఫైర్ అయ్యారు. ఏపీలో అర్ధరాత్రి బెల్టు షాపులు నడుస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించిందని గుర్తుచేశారు. ఇవాళ(సోమవారం) అమరావతి వేదికగా మీడియాతో మాట్లాడారు ఆలపాటి రాజేంద్రప్రసాద్.
ఈ ఘటన జరిగిన సమయంలో దుబాయ్‌లో సీఎం చంద్రబాబు ఉన్నారని.. అక్కడి నుంచి వెంటనే స్పందించారని తెలిపారు. మంత్రులకు ఘటన స్థలానికి వెళ్లి... సహాయక చర్యలు వేగంగా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. చనిపోయిన బైకర్ మద్యాన్ని బెల్ట్ షాపులో కొనుగోలు చేయలేదని, ప్రభుత్వ అనుమతి పొందిన లైసెన్స్‌డ్ దుకాణం నుంచే కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో క్లారిటీగా ఉందని నొక్కిచెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రాష్ట్రంలో మద్యం షాపులు నడుస్తున్నాయని ఉద్ఘాటించారు. కర్నూలు ఘటనకు కారణమైన ట్రావెల్స్ బస్సుకు పర్మిట్, లైసెన్స్, ఇన్సూరెన్స్ సరైనా పత్రాలు లేవనే విధంగా తప్పుడు కథనాలని బ్లూ మీడియా ప్రసారం చేసిందని దుయ్యబట్టారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
సిద్ధాంతపరంగా రాజకీయ పోరాటాలు చేయెచ్చు కానీ ఇలాంటి విషయంలో రాజకీయాలు చేస్తారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలాంటి సమయంలో కర్నూలు బస్సు ఘటన రాజకీయాలకు అవసరమా..? అని నిలదీశారు. వైసీపీ హయాంలో కల్తీ మద్యంతో చాలామంది చనిపోయారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో వైసీపీ నాయకులు జైలుకెళ్లారని విమర్శించారు. జగన్ అండ్ కో చేసిన కుంభకోణాలు, కల్తీ మద్యం అంశాలని పక్కదోవ పట్టించడానికి కర్నూలు బస్సు ప్రమాద ఘటనని ఆ పార్టీ నేతలు ఎంచుకున్నారని ఎద్దేవా చేశారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
పోలవరం కాపర్ డ్యామ్, అమరావతిపై కూడా ఇలానే అసత్య ప్రచారం చేశారని ఫైర్అయ్యారు. అలాగే, ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం డీఏ ఇవ్వలేదని తప్పుడు ప్రసారం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ ధనం ఎలా దోచుకోవాలో వైసీపీ నేతలకే తెలిసిన విద్య అని సెటైర్లు గుప్పించారు. పార్టీ కార్యకర్తను కారుతో తొక్కించిన చరిత్ర వైసీపీదని ఎద్దేవా చేశారు. తప్పుడు ప్రచారాలు చేస్తోన్న మీడియాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దు.. పాలక మండలి విజ్ఞప్తి
బస్సు దగ్ధం ఘటన.. డెడ్‌బాడీస్ అప్పగింత పూర్తి
Read latest AP News And Telugu News