Share News

Lokesh Meet Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మంత్రి లోకేష్ భేటీ.. ఎందుకంటే..

ABN , Publish Date - Sep 22 , 2025 | 02:18 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మంత్రి నారా లోకేష్ సోమవారం అసెంబ్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

Lokesh Meet Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం  పవన్ కల్యాణ్‌తో మంత్రి లోకేష్ భేటీ.. ఎందుకంటే..
Minister Lokesh Meet Pawan Kalyan

అమరావతి, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)తో మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఇవాళ(సోమవారం) అసెంబ్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈనెల 25వ తేదీన జరుగనున్న మెగా డీఎస్సీ (Mega DSC 2025) కార్యక్రమానికి పవన్‌ని ఆహ్వానించారు లోకేష్. ఈ కార్యక్రమంలో డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నామని తెలిపారు. గత అయిదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోగా, మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు ప్రత్యర్థులు దాదాపు 106 కేసులు వేశారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని లోకేష్ తెలిపారు. మెగా డీఎస్సీ వల్ల ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ టీచర్ల కలలు సాకారం అయ్యాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.


మంత్రివర్గ ఉపసంఘం భేటీ

అలాగే, అసెంబ్లీలోని లోకేష్ ఛాంబర్‌లో జీఎస్టీ సంస్కరణలపై (GST Reforms) మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. లోకేష్ నేతృత్వంలో మంత్రులు పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్ సమావేశమయ్యారు. అమల్లోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ఏపీకి కలిగే లబ్ధి, తదితర అంశాలపై మంత్రులు చర్చించారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి సామాన్యులకు కలుగుతున్న లబ్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ అవగాహన కార్యక్రమాలు చేపడదామని లోకేష్ దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ

ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 22 , 2025 | 03:09 PM