Mega DSC Meeting: నేడు మెగా డీఎస్సీ సభ.. నియామక పత్రాల పంపిణీ
ABN , Publish Date - Sep 25 , 2025 | 08:43 AM
ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు ఉత్సాహంగా ఉండగా వారిని మరింత సంతోషపరుస్తూ నియామకపత్రాల పంపిణీకి ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. గురువారం రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి సచివాలయ సమీపంలో డీఎస్సీ సభకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
వెలగపూడి సచివాలయం వద్ద డీఎస్సీ సభ
హాజరుకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
నేడు నియామకపత్రాల పంపిణీ
తుళ్లూరు (వెలగపూడి), నరసరావుపేట, గుంటూరు(విద్య), సెప్టెంబరు 24 (ఆంధ్ర జ్యోతి): ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు ఉత్సాహంగా ఉండగా వారిని మరింత సంతోషపరుస్తూ నియామకపత్రాల పంపిణీకి ఏపీ ప్రభుత్వం (AP Govt) భారీగా ఏర్పాట్లు చేసింది. గురువారం రాజధాని అమరావతి (Amaravati) పరిధిలోని వెలగపూడి సచివాలయ సమీపంలో డీఎస్సీ సభకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన డీఎస్సీ అభ్యర్థులకు (Mega DSC Candidates) నియామక పత్రాలు అందచేయనున్నారు. ఇందుకు సం బంధించిన కార్యక్రమం, బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
కాగా ముఖ్యమంత్రి నుంచి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకునేందుకు మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు వివిధ ప్రాంతాల నుంచి బుధవారం సాయంత్రానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో గుంటూరు, నరసరావుపేట తదితర ప్రాంతాలకు తరలి వచ్చారు. ఎక్కడికక్కడ విద్యాశాఖ అధికారులు వారి బసతో పాటు డీఎస్సీ సభకు సంబంధించి గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఉపాధ్యాయ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులను వెలగపూడికి తరలించేందుకు 71 బస్సులు ఏర్పాటు చేశారు. గుంటూరు పొన్నూరు రోడ్డులోని ఆంధ్రా ముస్లిం కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో జోన్-3 (గుంటూరు, ప్రకాశం, నెల్లూ రు) పరిధిలో ఎంపికైన అభ్యర్థులకు బుధవారం గుర్తింపు కార్డులు అంద జేసినట్లు డీఈవో రేణుక తెలిపారు. కాగా ఇక్కడి నుంచి డీఎస్సీ అభ్యర్థులు, వారి కుటుంబసభ్యులతో కూడిన బస్సు లు గురువారం ఉదయం 7 గంటలకు బయలుదేరతాయన్నారు. ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమైన గుర్తింపు కార్డుల పంపిణీ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది.
పటిష్ఠ బందోబస్తు : ఐజీ
డీఎస్సీ సభకు పటిష్ఠంగా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఐజీ సర్వశ్రేష్టత్రిపాఠి తెలిపారు. అధికా రులకు బందోబస్తు నిర్వహణ గురించి ఐజీ తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లో దిశానిర్దేశం చేశారు. వీవీఐపీ, వీఐపీ, డీఎస్సీ అభ్యర్థుల కు కేటాయించిన మార్గాల్లో వారిని అనుమతించాలని చెప్పారు. ఎక్క డా ఎటువంటి అవాంఛనీయ సం ఘటనలకు తావులేకుండా జాగ్రత్త వహించాలన్నారు. వేదిక వద్ద విధులు నిర్వహించే వారు అప్ర మత్తంగా ఉండాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, ఏఎస్పీలు రమణమూర్తి, రవికుమార్, సుప్రజ, హనుమంతు, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ఎస్బీ సీఐ అళహరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పసుపు సాగులో కొత్త పద్ధతులు... అంతర పంటగా బొప్పాయి
For More Andhra Pradesh News and Telugu News..