Share News

Papaya Farming: పసుపు సాగులో కొత్త పద్ధతులు... అంతర పంటగా బొప్పాయి

ABN , Publish Date - Sep 25 , 2025 | 08:35 AM

పసుపు సాగులో రైతులు కొత్తపద్ధతులు అవలంభిస్తున్నారు. పసుపుతో పాటు అంతర పంటగా బొప్పాయి సాగు చేపడుతు న్నారు. డ్రిప్‌ ఏర్పాటు చేసి నీటి తడులు అందించ డంతో తోటలు ఏపుగా పెరిగి కళకళలాడుతున్నాయి.

Papaya Farming: పసుపు సాగులో కొత్త పద్ధతులు... అంతర పంటగా బొప్పాయి
Papaya Farming

దువ్వూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పసుపు సాగులో (Turmeric Cultivation) రైతులు కొత్తపద్ధతులు అవలంభిస్తున్నారు. పసుపుతో పాటు అంతర పంటగా బొప్పాయి సాగు (Papaya Farming) చేపడుతున్నారు. డ్రిప్‌ ఏర్పాటు చేసి నీటి తడులు అందించ డంతో తోటలు ఏపుగా పెరిగి కళకళలాడుతున్నాయి. మైదుకూరు ప్రాంతం పసుపు సాగుకు పెట్టింది పేరు. ఇక్కడ పండిన పసుపు పంట నాణ్యత పరంగా వ్యాపారులను ఆకర్షిస్తోంది. దువ్వూరు, ఖాజీపేట, మైదుకూరు, చాపాడు మండలాల్లో విస్తృతంగా ఈ పంటను సాగుచేశారు.


పంట సాగుకు ఖర్చులు పెరిగిన నేపధ్యంలో సైతం పంట వేసేందుకు రైతులు వెనుకాడటం లేదు. మార్కెట్‌లో వట్టి పసుపునకు డిమాండ్‌ ఉండడం, మంచి ధరలు పలకడంతో రైతులు ఈ సంవత్సరం కూడా పసుపు సాగుకు ఎక్కువ ఆసక్తి కనపరిచారు. దువ్వూరు మండలంలో కిందటి సంవత్సరం 582 ఎకరాల్లో సాగైనట్లు అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. ఈ సంవత్సరం అదనంగా మరో వంద ఎకరాల్లో విస్తీర్ణం పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది రైతులు పసుపులో అంతర పంటగా బొప్పాయిని సాగు చేశారు. తద్వారా తెగుళ్ల నివారణకు ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక పసుపు పంటలో డ్రిప్‌ విధానం అవలంభించేందుకు రైతులు ఆసక్తి కనపరుస్తున్నారు. తద్వారా తోటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులు వచ్చేందుకు తోడ్పడుతుందని అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం డ్రిప్‌ ఏర్పాటు చేసిన తోటలు కళకళలాడుతున్నాయి.


డ్రిప్‌తో బహుళ ప్రయోజనాలు

పసుపు సాగులో డ్రిప్‌ ఏర్పాటు చేయడం వలన ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. నేరుగా మొక్కకు నీరు అందుతుంది. నీటి వృథాను అరికట్టవచ్చు. ఎరువులను మొక్కకు అందేటట్లు చేయవచ్చు. కలుపు తగ్గుతుంది. ఖర్చులు ఆదా అవుతాయి. దిగుబడి పెరిగి రైతుకు లాభసాటిగా ఉంటుంది.

- రామకృష్ణ, ఉద్యానవన శాఖ అధికారి, మైదుకూరు


ఈ వార్తలు కూడా చదవండి

అది నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: మంత్రి లోకేష్

మీ వాదనలో నిజం ఉంటే సభకు రా.. జగన్‌కు మంత్రి సవాల్

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 25 , 2025 | 08:36 AM