Forest Department Scam: అటవీ శాఖలో అవినీతి..!
ABN , Publish Date - Sep 25 , 2025 | 07:51 AM
ఏపీలోనే సంచలనంగా మారిన అటవీశాఖ రిటైర్డు ఉద్యోగి చాంద్‌బాషా చేసిన అక్రమాలను పరిశీలిస్తే ఆశాఖలో అవినీతి హెచ్చుమీరినట్లు తెలుస్తోంది. ఈ అవకతవకల్లో కింది స్థాయి ఎఫ్‌బీఓల నుంచి ఐఎఫ్ఎస్ అధికారుల వరకు అడుగడుగున వారి పనితీరుపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
అటవీ శాఖలో భారీ అవినీతి..!!
చాంద్‌బాషా వ్యవహారంలో ఆశ్చర్యపోయేలా అవకతవకలు
ఇప్పటివరకు రూ.7.5కోట్ల వరకు నిధులు దారి మళ్లింపు?
రేంజ్‌ల పరిధిలోనూ.. అక్రమాల ఊడలు
ఆత్మకూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఏపీలోనే సంచలనంగా మారిన అటవీశాఖ రిటైర్డు ఉద్యోగి చాంద్‌బాషా (Chand Basha) చేసిన అక్రమాలను పరిశీలిస్తే ఆశాఖలో అవినీతి హెచ్చుమీరినట్లు తెలుస్తోంది. ఈ అవకతవకల్లో కింది స్థాయి ఎఫ్‌బీఓల నుంచి ఐఎఫ్ఎస్ అధికారుల వరకు అడుగడుగున వారి పనితీరుపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించిన అటవీశాఖ ఉన్నతాధికారులు ఈ ఏడాది మే 19న ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించారు. వీరు చేపట్టిన విచారణలో రూ.7.5కోట్ల వరకు అక్రమాలు వెలుగుచూసినట్లు తెలిసింది. అయితే వాటికి సంబంధించి పూర్తిస్థాయిలో ఆధారాలు లభించకుండా చాంద్‌బాషా ఎక్కడికక్కడ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
దీంతో విచారణ బృందం అధికారులు సైతం తలలు పట్టుకుని తాము పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయలేమంటూ చేతులెత్తేసినట్టు సమాచారం. ఆత్మకూరు టైగర్ ప్రాజెక్ట్ కార్యాలయం పరిధిలో అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్‌గా పని చేసి గత ఏడాది జూలై నెలలో పదవీవిరమణ పొందిన చాంద్‌బాషా చేసిన అక్రమాల్లో ప్రధానంగా చెక్‌పోస్టుల నుంచి వచ్చిన సొమ్మును ఆంధ్రప్రదేశ్ టైగర్ కన్జర్వేషన్ ఫండ్ (ఏపీటీసీఎఫ్), ఫారెస్టు డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎఫ్‌డీఏ) తదితర సంస్థలకు చెక్కులను ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేసినప్పుడు మాత్రమే చేతివాటం ప్రదర్శించి ఆ చెక్కులను దారిమళ్లించినట్లు తొలుత అధికారులు గుర్తించారు. ఈ లెక్కన జూన్ 21వ తేదీ వరకు జరిగిన విచారణలో రూ.4.37కోట్ల వరకు నిధులు స్వాహా చేసినట్లు నిర్ధారించారు. ఆ తర్వాత కూడా చేపట్టిన విచారణలో చాంద్‌బాషా అటవీశాఖలోని వివిధ పథకాలకు సంబంధించి నిధుల విషయంలో కూడా గోల్‌మాల్ జరిగి మరో రూ.3కోట్లకు పైగా అక్రమాలు వెలుగుచూసినట్లు తెలిసింది. కింది స్థాయి అటవీ సిబ్బంది మొదలుకుని కొందరు రేంజర్లను కూడా భాగస్వాముల్ని చేసి నిధులను దారిమళ్లించినట్లు సమాచారం.
అటవీ శాఖ పరిపాలనలో పలు పథకాలను అమలు చేస్తుంటారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కాంపన్సేటరీ ఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (ఏపీసీఏఎంపీఏ) పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తారు. అటవీ భూమి, పర్యావరణ వ్యవస్థ సేవలు నష్టపోయినట్లయితే పరిహారం ద్వారా అటవీకరణను పెంచడం, సహజ పునరుత్పత్తి సహాయంతో అడవుల నాణ్యతను మెరుగుపర్చడం, జీవ వైవిధ్యాన్ని సుసంపన్నం చేయడం, వన్యప్రాణుల అవాసాలను మెరుగుపర్చడం, అటవీ అగ్ని నియంత్రణ, అటవీ రక్షణ, నేల, నీటి సంరక్షణ కోసం ప్రతిఏటా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను మంజూరు చేస్తారు. ఒక్క ఆత్మకూరు డివిజన్‌లోనే 48 వీఎస్‌ఎస్ కమిటీలను ఏర్పాటు చేసి వీటి ద్వారానే అడవుల్లో చెక్‌డ్యామ్ నిర్మాణ పనులు, నీటికుంటలు, పూడిక తీత పనులు, మొక్కలు నాటడం, అడవుల్లో విత్తనాలు చల్లించడం తదితర పనులను చేపడతారు. అయితే ఈ పథకాలకు సంబంధించి కేటాయించిన నిధుల వినియోగంలో కూడా చాంద్‌బాషా గోల్‌మాల్ చేసినట్లు తెలిసింది.
అటవీ శాఖ పరిపాలనలో పలు పథకాలను అమలు చేస్తుంటారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కాంపన్సేటరీ ఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (ఏపీసీఏఎంపీఏ) పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తారు. అటవీ భూమి, పర్యావరణ వ్యవస్థ సేవలు నష్టపోయినట్లయితే పరిహారం ద్వారా అటవీకరణను పెంచడం, సహజ పునరుత్పత్తి సహాయంతో అడవుల నాణ్యతను మెరుగుపర్చడం, జీవ వైవిధ్యాన్ని సుసంపన్నం చేయడం, వన్యప్రాణుల అవాసాలను మెరుగుపర్చడం, అటవీ అగ్ని నియంత్రణ, అటవీ రక్షణ, నేల, నీటి సంరక్షణ కోసం ప్రతిఏటా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను మంజూరు చేస్తారు. ఒక్క ఆత్మకూరు డివిజన్‌లోనే 48 వీఎ్‌సఎస్ కమిటీలను ఏర్పాటు చేసి వీటి ద్వారానే అడవుల్లో చెక్‌డ్యామ్ నిర్మాణ పనులు, నీటికుంటలు, పూడిక తీత పనులు, మొక్కలు నాటడం, అడవుల్లో విత్తనాలు చల్లించడం తదితర పనులను చేపడతారు. అయితే ఈ పథకాలకు సంబంధించి కేటాయించిన నిధుల వినియోగంలో కూడా చాంద్‌బాషా గోల్‌మాల్ చేసినట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి
అది నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: మంత్రి లోకేష్
మీ వాదనలో నిజం ఉంటే సభకు రా.. జగన్‌కు మంత్రి సవాల్
For More Andhra Pradesh News and Telugu News..