Sudarshan Reddy Calls YS Jagan: జగన్‌కు సుదర్శన్ రెడ్డి ఫోన్.. ఎందుకంటే
ABN , Publish Date - Aug 31 , 2025 | 08:27 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఆదివారం ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి కోరారు.
అమరావతి, ఆగస్టు 31, (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy)కి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) ఇవాళ (ఆదివారం) ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి కోరారు.
ఇండియా కూటమి అభ్యర్థి ప్రకటనకు ముందే ఎన్డీఏ నేతలు తమతో మాట్లాడారని జగన్ సమాధానం ఇచ్చారు. ఎన్డీఏ అభ్యర్థనకుగానూ ముందుగానే వారికి మాట ఇచ్చినట్లు జగన్ చెప్పారు. దీంతో ఎన్డీఏ అభ్యర్థికే జగన్ మద్దతనే విషయం తేలిపోయిందని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు కేసు విషాదాంతం
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు.. ఎన్నిరోజులంటే..
For More AP News And Telugu News