Share News

Heavy Rains in AP: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు.. ఎన్నిరోజులంటే..

ABN , Publish Date - Aug 31 , 2025 | 04:33 PM

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Heavy Rains in AP: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు.. ఎన్నిరోజులంటే..
Heavy Rains in AP

అమరావతి, ఆగస్టు 31, (ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్ - ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి సగటున 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు పేర్కొన్నారు.


దీంతో మంగళవారం (సెప్టెంబర్ 02)వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains in AP) కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి నారా లోకేష్‌కు మరో అరుదైన గౌరవం

14, 15 తేదీల్లో తిరుపతిలో మహిళా పార్లమెంటేరియన్ల సమావేశం

For More AP News And Telugu News

Updated Date - Aug 31 , 2025 | 05:38 PM