Head Constable Subbarao Case in Tragedy: హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు కేసు విషాదాంతం
ABN , Publish Date - Aug 31 , 2025 | 08:12 PM
ఏలూరు జిల్లాకు చెందిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ బి.సుబ్బారావు అదృశ్యం కేసు విషాదాంతంగా ముగిసింది. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి వద్ద ఎర్రకాల్వలో అతని మృతదేహం లభ్యమైంది.
ఏలూరు, ఆగస్టు 31, (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాకు చెందిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ బి.సుబ్బారావు (Head Constable Subbarao) అదృశ్యం కేసు విషాదాంతంగా ముగిసింది. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి వద్ద ఎర్రకాల్వలో ఆయన మృతదేహం లభ్యమైంది. సుబ్బారావుది ఆత్మహత్యా లేక హత్యా? అనే కోణంలో పోలీసుల విచారణ జరుపుతున్నారు.
ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే, చివరిసారిగా హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు ఫోన్ సిగ్నల్ ను అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. సుబ్బారావు ద్విచక్రవాహనం టి.నరసాపురం మండలం మధ్యాహ్నపువారిగూడెం వద్ద ఎర్రకాలువలో దొరికినట్లు సమాచారం. కామవరపుకోటకు చెందిన ఒక యువకుడిని అదుపులోకి తీసుకుని తడికలపూడి పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కలెక్టరేట్ నిర్మాణంపై డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
14, 15 తేదీల్లో తిరుపతిలో మహిళా పార్లమెంటేరియన్ల సమావేశం
For More AP News And Telugu News