Dalit Associations warn Jagan: జగన్ పర్యటనని అడ్డుకుంటాం.. దళిత సంఘాల స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:07 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని దళిత సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి. జగన్ నర్సీపట్నంలో అడుగు పెట్టే ముందు, దివంగత డాక్టర్ సుధాకర్ తల్లికి, వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అమరావతి , అక్టోబరు8 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నర్సీపట్నం పర్యటన (Narasipatnam Visit)ను అడ్డుకుంటామని దళిత సంఘాలు (Dalit Associations) తీవ్రంగా హెచ్చరించాయి. జగన్ నర్సీపట్నంలో అడుగు పెట్టే ముందు, దివంగత డాక్టర్ సుధాకర్ (Doctor Sudhakar) తల్లికి, వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డాక్టర్ సుధాకర్ మరణానికి జగనే కారణమని, ఇది ప్రపంచానికి తెలిసిన నిజమని దళిత సంఘాలు ఆరోపించాయి.
ఒక మాస్క్, పీపీఈ కిట్ అందించలేక డాక్టర్ సుధాకర్‌ను బలిగొన్న జగన్, ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ కడతానంటే ప్రజలు నమ్మరని విమర్శించారు. ఒక వైద్యుడి ప్రాణాలనే కాపాడలేని వారు, మెడికల్ కాలేజీ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్‌కు జరిగిన అన్యాయంపై, ఆయన మృతిపై ఇంతవరకు న్యాయం జరుగలేదని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణ చెప్పని పక్షంలో.. దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆయన పర్యటనను అడ్డుకుని తీరుతామని దళిత సంఘాలు హెచ్చరించాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. నిందితులకి బెయిల్ ఆర్డర్స్ ఇవ్వకుండా సిట్ పిటిషన్
పిన్నెల్లి సోదరులకు బిగ్ షాక్.. ఎందుకంటే..
Read Latest AP News And Telugu News