CM Chandrababu Teleconference ON TDP Leaders: పండుగలాంటి వార్త.. త్వరలో జిల్లా కమిటీల ప్రకటన
ABN , Publish Date - Aug 27 , 2025 | 09:32 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తామని... రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
అమరావతి, ఆగస్టు27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ముఖ్య నేతలతో ఇవాళ(బుధవారం) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తామని... రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు చేస్తున్నామని ప్రకటించారు. పెన్షన్లు తెచ్చింది, పెంచింది మనమేనని ఉద్ఘాటించారు సీఎం చంద్రబాబు.
రూ.500 ఉన్న దివ్యాంగుల పెన్షన్లను... రూ.6 వేలు చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేలు ఇస్తుంది మనమేనని ఉద్ఘాటించారు. మాట్లాడటానికే అర్హత లేని పార్టీ మన ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని చెప్పుకొచ్చారు. అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని భరోసా కల్పించారు. అర్హులకు న్యాయం జరిగేలా పార్టీ యంత్రాంగం పని చేయాలని సూచించారు. పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఇంటింటికీ వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఎంతో చేస్తున్నామని... చేసింది చెప్పుకుందామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యుదాఘాతంతో యువకుడు మృతి.. పవన్ కల్యాణ్ విచారం
భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్
For AP News And Telugu News