CM Chandrababu: రైతు రామారావు కుటుంబ సభ్యులని పరామర్శించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Dec 27 , 2025 | 05:47 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాజధాని రైతు దొండపాటి రామారావు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
అమరావతి,డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ(శనివారం) రాజధాని రైతు దొండపాటి రామారావు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎన్-8 రహదారి విషయమై తుళ్లూరులో నిన్న(శుక్రవారం) మందడం రైతులతో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న సమయంలోనే గుండెపోటుతో కుప్పకూలారు రామారావు. ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందారు. ఈ క్రమంలోనే సీఎం ఆయన కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని రామారావు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఆ కుటుంబానికి అండగా ఉండాలని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌కు సీఎం చంద్రబాబు సూచించారు.
ఇవి కూడా చదవండి...
రెచ్చిపోతున్న వైసీపీ శ్రేణులపై పోలీసుల ఉక్కుపాదం
జిల్లాల పునర్విభజనలో కీలక మార్పులకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం
Read Latest AP News And Telugu News