Share News

CM Chandrababu On AP Employees: ఈ నెల 18న ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

ABN , Publish Date - Oct 17 , 2025 | 09:37 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉద్యోగ సంఘాలతో ఏపీ సచివాలయంలో సమావేశం కానున్నారు. ఉద్యోగ సంఘాలతో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు సీఎం చంద్రబాబు.

CM Chandrababu On AP Employees: ఈ నెల 18న ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
CM Chandrababu On AP Employees

అమరావతి, అక్టోబరు17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) రేపు(శనివారం) ఉద్యోగ సంఘాలతో ఏపీ సచివాలయంలో సమావేశం కానున్నారు. రేపు ఉదయం 11:00 గంటలకు మంత్రులు, ఉద్యోగ సంఘాలతో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు సీఎం చంద్రబాబు.


ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధ్యక్షతన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఈ సమావేశంలో మాట్లాడనున్నారు. ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్య శాఖ, మంత్రి సత్యకుమార్ యాదవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ ఐఏఎస్, ఆర్థిక , ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఐఏఎస్, ఆర్థిక శాఖ, కార్యదర్శి వి. వినయ్ చంద్ ఐఏఎస్, గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నాయకులు హాజరు కానున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సామాన్యులకు ఉపయోగపడేలా పోస్టల్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పురోగతి: పెమ్మసాని

జగన్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు విధ్వంసం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 17 , 2025 | 09:46 PM