Share News

CM Chandrababu ON Health Vision: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ మనందరి ఆకాంక్ష: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 23 , 2025 | 05:21 PM

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ మనందరి ఆకాంక్ష అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 2047 నాటికి చైనా జనాభా 100 కోట్లే ఉంటుందని తెలిపారు. ఆరోగ్యం కాపాడుకోవడం అతిముఖ్యమని సూచించారు.

CM Chandrababu ON Health Vision: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ మనందరి ఆకాంక్ష: సీఎం చంద్రబాబు
CM Chandrababu ON Health Vision

అమరావతి, సెప్టెంబరు23 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ మనందరి ఆకాంక్ష అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ(మంగళవారం) వైద్యా, ఆరోగ్య శాఖ (Medical And Health Departments)పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. 2026 నాటికి ఏపీలో 5.37 కోట్ల మంది జనాభా ఉంటారని వెల్లడించారు. 2047 నాటికి భారత్‌ జనాభా 162 కోట్లు దాటుతుందని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.


2047 నాటికి చైనా జనాభా 100 కోట్లే ఉంటుందని తెలిపారు. ఆరోగ్యం కాపాడుకోవడం అతి ముఖ్యమని సూచించారు. దక్షిణాదిలో జనాభా క్రమంగా తగ్గుతోందని చెప్పుకొచ్చారు. యూపీ, బిహార్‌ వల్లే జనాభా బ్యాలెన్స్‌ అవుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గుతోందని తెలిపారు. ఏపీలో పీహెచ్‌సీల సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువ అని వివరించారు సీఎం చంద్రబాబు.


డబ్య్లూహెచ్‌వో (WHO) ప్రకారం మెడికల్‌ ఆఫీసర్లు మనదగ్గరే ఎక్కువ అని చెప్పుకొచ్చారు. ఏపీలో ప్రస్తుతం 1.15 లక్షలమంది వైద్యులు ఉన్నారని వెల్లడించారు. భారతదేశంలో సగటు జీవితకాలం 70 ఏళ్లు అని వివరించారు. భారతదేశంలో MMRR 30గా ఉందని తెలిపారు. మనదేశంలో ఇమ్యూనైజేషన్‌ 97 శాతమని చెప్పుకొచ్చారు. ఏపీలో 98 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 42 శాతమేనని వివరించారు సీఎం చంద్రబాబు.


ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు 78 శాతం సాధించామని వెల్లడించారు. త్వరలో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో 100 శాతం సాధిస్తామని ఉద్ఘాటించారు. గర్భిణుల్లో అనీమియా 32 శాతం ఉందని తెలిపారు. సిజేరియన్‌లో మనమే నెంబర్‌వన్‌.. ఇది సరికాదని చెప్పుకొచ్చారు. 90 శాతం సిజేరియన్లు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అది నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: మంత్రి లోకేష్

మీ వాదనలో నిజం ఉంటే సభకు రా.. జగన్‌కు మంత్రి సవాల్

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 23 , 2025 | 05:34 PM