Share News

CM Chandrababu: కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకెళ్లదు

ABN , Publish Date - May 01 , 2025 | 10:31 AM

CM Chandrababu: కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకెళ్లదని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కార్మిక వర్గానికి మేలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

CM Chandrababu: కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకెళ్లదు
CM Chandrababu Naidu

అమరావతి: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా కార్మిక, కర్షక సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలిపారు. ఈమే రకు సోషల్ మీడయా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. శ్రమ దోపిడికి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు జరిపిన పోరాట ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెల్లివిరిసిందని ఉద్ఘాటించారు. ఆనాటి దోపిడి విధానాలను సమూలంగా మార్చుకుని కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు ఇదని అభివర్ణించారు. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్లదని చెప్పారు.


కార్మిక, కర్షకులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్లడం ప్రస్తుతం అత్యంత అవసరమని అన్నారు. కార్మిక వర్గం పక్షాన నిలబడి వారికి మేలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. నాలా చట్టం రద్దు, ఉచిత ఇసుక విధానం, భవన నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు సరళతరం చేయడం వంటి నిర్ణయాలతో ఇప్పటికే నిర్మాణ రంగాన్ని నిలబెట్టి లక్షల మంది జీవితాలకు భద్రత కల్పించామని చెప్పారు.. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వంగా, కష్టజీవుల ప్రభుత్వంగా ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: మంత్రి నారా లోకేష్

కార్మిక సోదర, సోదరీమణులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈమే రకు సోషల్ మీడయా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజే మేడే అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని కొనియాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో కార్మికులు, కర్షకుల అభ్యున్నతికి కృషిచేస్తున్నామని చెప్పారు. వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu: నెల్లూరు జిల్లా పర్యటనకు..

పహల్గాం దాడిని ఖండించిన ఐక్యరాజ్య సమితి

ప్రభుత్వ వెంచర్లో కొంటే రిజిస్ట్రేషన్‌ ఖర్చు తక్కువ

For More AP News and Telugu News

Updated Date - May 01 , 2025 | 10:32 AM