AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ నేడు.. కీలక అంశాలపై చర్చ
ABN , Publish Date - May 08 , 2025 | 08:53 AM
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ గురువారం నాడు సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. మంత్రి మండలితో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.

అమరావతి: ఏపీ కేబినెట్ భేటీ ఇవాళ(గురువారం) జరుగనుంది. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన ఉదయం 11గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. అమరావతి పున: ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్ ఈరోజు ఆమోదం తెలపనుంది.
పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ ఆమోదం తెలపనుంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే ఛాన్స్ ఉంది. తీర ప్రాంత భద్రతపై ప్రత్యేకంగా కేబినెట్‌తో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఆపరేషన్ సిందూరo విజయవంతంగా నిర్వహించిన భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు కేబినెట్ అభినందనలు తెలపనుంది.
ఏపీ కేబినెట్ సమావేశంలో సుమారు 25 నుంచి 30 అంశాలు అజెండాగా సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఇవాళ(మే8) ఏపీ కేబినెట్ సమావేశంలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేరుస్తూ చట్ట సవరణ చేసేందుకు కేబినెట్‌లో చర్చించి ఆమోదించనున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత కేంద్రానికి పంపే అవకాశం ఉంది. మత్స్యకారులకు చేపలవేట నిషేధ సమయంలో ఇచ్చే రూ. 10 వేలను రూ. 20 వేలకు పెంచుతూ మంత్రిమండలి ఆమోదించనుంది.
ఇప్పటికే ఈ నిధులను ఏపీ ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. మున్సిపల్ శాఖ ద్వారా 281 పనులను హైబ్రిడ్ యాన్యువల్ విధానం(HAM)లో చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. లేబర్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి 2019లో గత జగన్ ప్రభుత్వం ఆమోదించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న మూడు బిల్లులను వెనక్కి తీసుకునేందుకు మంత్రి మండలి ఆమోదించనుంది. ఇండస్ట్రీయల్ సవరణ బిల్లు 2019, లేబర్ లాస్ బిల్లు 2019, ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు 2019పై కేబినెట్‌లో చర్చించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Nara Lokesh: ప్రధానికి సైన్యానికి అండగా నిలుద్దాం
Minister Savitha: జగన్ త్వరలో నీకూ గాలి గతే
Payyavula Keshav: టీడీపీ పోరాట ఫలితమే గాలికి శిక్ష
Ration Scam Probe: రేషన్ బియ్యంపై సిట్ పునర్‌వ్యవస్థీకరణ
For More AP News and Telugu News