Share News

Ration Scam Probe: రేషన్‌ బియ్యం పై సిట్‌ పునర్‌వ్యవస్థీకరణ

ABN , Publish Date - May 08 , 2025 | 05:46 AM

రేషన్ బియ్యం అక్రమాలపై దర్యాప్తు కొనసాగించేందుకు సిట్‌ పునఃవ్యవస్థీకరణ చేపట్టింది. కొత్తగా ఐపీఎస్‌ ఆకే రవికృష్ణను సిట్‌ అధిపతిగా నియమించారు

Ration Scam Probe: రేషన్‌ బియ్యం పై సిట్‌ పునర్‌వ్యవస్థీకరణ

అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): రేషన్‌ బియ్యం అక్రమ ఎగుమతులపై కాకినాడ జిల్లాలో నమోదైన కేసులు, సంబంధిత ఇతర నేరాల దర్యాప్తును కొనసాగించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. ఇప్పటివరకు ఈ బృందానికి అధిపతిగా ఉన్న ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. దీంతో ఆయన స్థానంలో మరో ఐపీఎస్‌ అధికారి ఆకే రవికృష్ణను ‘సిట్‌’ నూతన అధిపతిగా నియమించింది. అదేవిధంగా గతంలో నియమించిన డీఎస్‌పీల స్థానంలో ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లను, సివిల్‌ సప్లయిస్‌కు చెందిన ఒక డీఎస్‌వో, ఒక డీఎంలను సభ్యులుగా నియమిస్తూ సీఎస్‌ విజయానంద్‌ ఉత్తర్వులిచ్చారు.

Updated Date - May 08 , 2025 | 05:46 AM