Share News

Payyavula Keshav: టీడీపీ పోరాట ఫలితమే గాలికి శిక్ష

ABN , Publish Date - May 08 , 2025 | 06:09 AM

గాలి జనార్ధన్‌రెడ్డికి శిక్ష పడటం టీడీపీ పోరాట ఫలితమేనని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. చంద్రబాబు నాటి అసెంబ్లీలో ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు

Payyavula Keshav: టీడీపీ పోరాట ఫలితమే గాలికి శిక్ష

గుంతకల్లు, మే 7(ఆంధ్రజ్యోతి): ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి శిక్ష పడటం టీడీపీ పోరాట ఫలితమేనని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాయపురంలో బుధవారం ఆయన మాట్లాడారు. ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని చంద్రబాబు నాడు అసెంబ్లీలో గళమెత్తారని గుర్తుచేశారు. కేసు దర్యాప్తు, విచారణ అలస్యమైనా న్యాయమే గెలిచిందన్నారు.

Updated Date - May 08 , 2025 | 06:09 AM