CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు
ABN , Publish Date - Sep 30 , 2025 | 03:08 PM
ఇవాళ సాయంత్రం కేంద్ర హోమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కలవనున్నారు. కష్టమైన పరిస్థితుల్లో ఏపీకి అండగా నిలుస్తునందుకు కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలపనున్నారు.
ఢిల్లీ: రాజధానిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడి పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌తో భేటీ అయ్యారు. పూర్వోదయ పథకం కింద ఏపీకి ఆర్థికసాయం కోరారు. పూర్వోదయ నిధులతో ఏపీలోని పలు ప్రాంతాల అభివృద్ధి కోసం.. ప్రణాళికలు రూపొందించినట్లు నిర్మలా సీతారామన్‌కు తెలిపారు. అలాగే.. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల..పెండింగ్ నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఆయన ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ ప్రత్యేక నిధులతో పాటు, రాష్ట్రంలో చేపట్టబోయే పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలవాలని అభ్యర్థించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో కీలకమని ఆయన నొక్కిచెప్పారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం.. ఇవాళ సాయంత్రం కేంద్ర హోమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కలవనున్నారు. కష్టమైన పరిస్థితుల్లో ఏపీకి అండగా నిలుస్తునందుకు కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలపనున్నారు. గత ప్రభుత్వం ద్వారా ధ్వంసమైన ఆర్ధిక వ్యవస్థకు కేంద్రం సహకారం అందించాలని కోరుతారు.
అయితే ఇప్పటికీ ఆర్థిక వనరుల పరంగా తీవ్రమైన కొరతను ఎదుర్కోంటున్న రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత సహకారం అవసరమనే విషయాన్ని సీఎం ప్రత్యేకంగా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు, ఆభివృద్ది కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. విభజన వల్ల ఏపీ ఎదుర్కొన్న ఆర్ధిక నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని నిధుల కేటాయింపులు చేసేలా చూడాల్సిందిగా అమిత్ షాను సీఎం చంద్రబాబు అభ్యర్థించనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి