Amaravati Development: అమరావతిలో కొత్త ప్రాజెక్టులు.. కేంద్రం ఆమోదం
ABN , Publish Date - Jun 17 , 2025 | 06:45 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు ప్రాజెక్ట్‌లకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు ప్రాజెక్ట్‌లకి కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆమోదం తెలిపింది. రూ 2,787 కోట్లతో నిర్మించే ప్రాజెక్ట్‌లని ఆమోదించింది. రూ. 1329 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా రూ. 1458 కోట్లతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ రెండు ప్రాజెక్ట్‌లని CPWD నిర్మిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖలోని Expenditure విభాగం ఆఫీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ద్వారా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) వివరాలు వెల్లడించారు. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ రెండు ప్రాజెక్ట్‌లకి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసిందని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం
మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.. శిరీష ఆవేదన
Read Latest AP News And Telugu News