Minister Nara Lokesh On Mumbai: ముంబైలో నారా లోకేష్ పర్యటన.. ఎందుకంటే..
ABN , Publish Date - Oct 06 , 2025 | 10:58 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం ముంబైలో పర్యటించనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలను ఆయన కలువనున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వివిధ కంపెనీల నిర్వాహకులను ఆహ్వానించనున్నారు మంత్రి లోకేష్.
అమరావతి, అక్టోబర్6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఇవాళ(సోమవారం) ముంబై (Mumbai)లో పర్యటించనున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలను ఆయన కలువనున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వివిధ కంపెనీల నిర్వాహకులను ఆహ్వానించనున్నారు మంత్రి లోకేష్. పారిశ్రామికవేత్తలతో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు లోకేష్.
లోకేష్ తన పర్యటనలో భాగంగా.. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, ట్రాఫీగురా (Trafigura) సీఈఓ సచిన్ గుప్తా, ఈఎస్ఆర్ గ్రూప్ (ESR group) హెడ్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ సాదత్ షా, హెచ్‌పీ ఐఎన్సీ (Hp Inc) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇప్సితా దాస్ గుప్తా, బ్లూ స్టార్ లిమిటెడ్ (Blue star Limited) డిప్యూటీ చైర్మన్ వీర్ అద్వానీతో సహా పలువురు పారిశ్రామికవేత్తలను కలవనున్నారు మంత్రి నారా లోకేష్.
ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ముంబై పర్యటన కొనసాగనున్నది. ఇవాళ సాయంత్రం ముంబైలో నిర్వహిస్తున్న 30వ సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో కూడా పాల్గొననున్నారు మంత్రి లోకేష్. అలాగే, నవంబర్‌లో విశాఖపట్నం వేదికగా జరిగే పార్టనర్ షిప్ సమ్మిట్‌లో పాల్గొనాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు మంత్రి లోకేష్.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News