Minister Kollu Ravindra: జగన్ హయాంలో ఏపీ సర్వనాశనం.. మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
ABN , Publish Date - Dec 04 , 2025 | 06:55 PM
ఏపీ ప్రజలందరూ ఆనందంగా ముందుకెళ్తుంటే జగన్ విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. ఏదో ఆయనకు సంబంధించిన నాలుగు ఛానళ్లను పెట్టుకుని హంగామా చేస్తున్నారని విమర్శలు చేశారు. కనీసం ప్రెస్‌మీట్‌లో విలేకర్లు వేసే ప్రశ్నలకు కూడా జగన్ సమాధానం చెప్పలేక తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర (AP Minister Kollu Ravindra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలకి ఒకటి, రెండుసార్లు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో రావడం.. వెళ్లే ముందు ప్రెస్‌మీట్ పెట్టి దుష్ప్రచారాలు చేయడం జగన్‌కి ఆనవాయితీగా వస్తోందని ధ్వజమెత్తారు. గత ఐదేళ్ల వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సంక్షేమం – అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని చెప్పుకొచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర.
ఏపీ ప్రజలందరూ ఆనందంగా ముందుకెళ్తుంటే జగన్ మాత్రం విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏదో ఆయనకు సంబంధించిన నాలుగు ఛానళ్లను అడ్డం పెట్టుకుని హంగామా చేస్తున్నారని విమర్శలు చేశారు. కనీసం ప్రెస్‌మీట్‌లో విలేకర్లు వేసే ప్రశ్నలకు కూడా జగన్ సమాధానం చెప్పలేక తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు మంత్రి కొల్లు రవీంద్ర.
ఒకే గదిలో మూడు గంటల పాటు జగన్ ప్రెస్‌మీట్ పెట్టారని సెటైర్లు గుప్పించారు. ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశం ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారని ప్రశ్నించారు. వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి.. ఒక నరరూప రాక్షసుడు గురించి.. ఆయనని దేవతామూర్తిగా చూపించాలని చూస్తున్నారా..? అని ఎద్దేవా చేశారు. లేకపోతే మాజీ మంత్రి జోగి రమేశ్ లాంటి వ్యక్తులను అద్భుతమైన వ్యక్తులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా..? అని దెప్పిపొడిచారు. పరకామణి కేసులో వేంకటేశ్వరస్వామి హుండీలో నుంచి డబ్బులు కొట్టేసిన వారిని వెనుకేసుకువచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారా..? అని మంత్రి కొల్లు రవీంద్ర సెటైర్లు గుప్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి
'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!
పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత
Read Latest AP News And Telugu News