Share News

AP High Court On Volunteers Case: వాలంటీర్లపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యల కేసులో హైకోర్టులో కీలక మలుపు

ABN , Publish Date - Oct 23 , 2025 | 10:05 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో ఓ సందర్భంలో వాలంటీర్లు సేకరించిన సమాచారం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తుందని... మహిళలు అపహరణకు గురి అవుతున్నారని వ్యాఖ్యానించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు దాఖలు చేసింది. గురువారం ఈ కేసు పిటీషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.

AP High Court On Volunteers Case: వాలంటీర్లపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యల కేసులో  హైకోర్టులో కీలక మలుపు
AP High Court On Volunteers Case

అమరావతి, అక్టోబరు23(ఆంధ్రజ్యోతి): వాలంటీర్లు (Volunteers) పబ్లిక్ సర్వెంట్ పరిధిలోకి ఎలా వస్తారని పిటిషనర్‌ని ప్రశ్నించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court). ఈ కేసు ఉపసంహరణ పిటిషన్‌ని తమ ముందు ఉంచాలని ఆదేశించింది హైకోర్టు. ఈ విచారణని మరో రెండు వారాలకు న్యాయస్థానం వాయిదా వేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)పై క్రిమినల్ కేసు విచారణ అర్హతపై గుంటూరు కోర్టు సీపీ సందేహం వ్యక్తం చేసింది. పవన్ కల్యాణ్ ప్రాసిక్యుషన్ ఉపసంహరణ కోసం వేసిన ఈ పిటిషన్‌ని తమ ముందు ఉంచాలని కోరింది ఏపీ హైకోర్టు.


కాగా, గతంలో పవన్ కల్యాణ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ... వాలంటీర్లు సేకరించిన సమాచారం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తుందని... మహిళలు అపహరణకు గురి అవుతున్నారని వ్యాఖ్యానించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు దాఖలు చేసింది. పవన్ వ్యాఖ్యలతో తమ ప్రతిష్టకు భంగం కలుగలేదని... వైసీపీ నేతలే తమ నుంచి సంతకాలు తీసుకొని పిటిషన్లు వేశారని వాలంటీర్లు తెలిపారు.


దీంతో పవన్ కల్యాణ్‌పై ప్రాసిక్యూషన్ ఉపసంహరణకు అనుమతించాలని గుంటూరు కోర్టులో పిటిషన్ వేసింది పబ్లిక్ ప్రాసిక్యూటర్. ప్రాసిక్యూషన్ ఉపసంహరణకు అనుమతి ఇస్తూ గుంటూరు కోర్టు గత ఏడాది నవంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టులో సరళ, మరో ముగ్గురు సవాల్ చేశారు. ఈ రోజు(గురువారం) ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ కేసులో జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. వాలంటీర్లు పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం పరిధిలోకి ఎలా వస్తారని ప్రశ్నించింది హైకోర్టు. ఈ పిటిషన్‌‌ని సవాల్ చేసినందుకు వారికి గౌరవ వేతనం చెల్లించిందని గుర్తుచేసింది హైకోర్టు. గుంటూరు కోర్టు సీపీ పవన్ కల్యాణ్‌పై దాఖలు చేసిన క్రిమినల్ కేసుపై సందేహం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు.


ఈ వార్తలు కూడా చదవండి..

అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

పీపీపీ మోడ్ అంటే అమ్మడం కాదు.. వైసీపీపై రఘరామ సెటైర్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 23 , 2025 | 10:22 PM