Share News

AP High Court On Group1: గ్రూప్‌-1 వివాదం.. ఏపీపీఎస్సీకి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Nov 03 , 2025 | 09:17 PM

గ్రూప్‌-1 వివాదంపై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. గ్రూప్-1 జవాబు పత్రాలను హాయ్‌ల్యాండ్‌కు తరలించాలనే నిర్ణయం ఎవరిదని ప్రశ్నించింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీకి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

AP High Court On Group1: గ్రూప్‌-1 వివాదం.. ఏపీపీఎస్సీకి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
AP High Court On Group1

అమరావతి, నవంబరు3 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 వివాదం(Group -1 Controversy)పై ఏపీ హైకోర్టు (AP High Court)లో మరోసారి విచారణ జరిగింది. గ్రూప్-1 జవాబు పత్రాలను హాయ్‌ల్యాండ్‌కు తరలించాలనే నిర్ణయం ఎవరిదని ప్రశ్నించింది న్యాయస్థానం. జవాబు పత్రాలను హాయ్‌ల్యాండ్‌ నుంచి.. తిరిగి ఏపీపీఎస్సీ(APPSC)కి ఎప్పుడు తరలించారని హైకోర్టు నిలదీసింది. బిల్లుల చెల్లింపు విషయంలో సంబంధిత వివరాలు తమముందు ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. జవాబు పత్రాలను సీల్డ్ కవర్‌లో అందజేయాలని ఏపీపీఎస్సీకి ఆజ్ఞాపించింది. తదుపరి విచారణని ఈనెల(నవంబరు)11వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

కృత్రిమ మేధస్సుతో అడవి ఏనుగుల సమస్య పరిష్కారం: పవన్ కల్యాణ్‌

వందేమాతరం 150 ఏళ్ల సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 03 , 2025 | 09:22 PM