AP Govt On Vande Mataram: వందేమాతరం 150 ఏళ్ల సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 03 , 2025 | 08:48 PM
వందేమాతరానికి 150 సంవత్సరాలు అయినందున ప్రత్యేక కార్యక్రమం నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. నవంబరు 7వ తేదీన దేశవ్యాప్తంగా అందరూ ఒక నిర్ణీత సమయంలో వందేమాతరం గేయం పాడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అమరావతి, నవంబరు3 (ఆంధ్రజ్యోతి): వందేమాతరానికి (Vande Mataram) 150 సంవత్సరాలు పూర్తి అయినందున ప్రత్యేక కార్యక్రమం నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Government) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. నవంబరు 7వ తేదీన దేశవ్యాప్తంగా అందరూ ఒక నిర్ణీత సమయంలో వందేమాతరం గేయం పాడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబరు 7వ తేదీన ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా సాముహికంగా వందేమాతరం ఆలపించాలని కేంద్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. పౌరులు, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆజ్ఞాపించింది.
పోలీసులు, వైద్యులు, ఉపాధ్యాయులు, దుకాణదారులు, ఇతర వర్గాల ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించింది. నవంబరు 7వ తేదీన వివిధ రాష్ట్రాల గవర్నర్లు, సీఎంల నేతృత్వంలో రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ఆజ్ఞాపించింది. జిల్లాల్లో, మండలస్థాయి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. ఈ క్రమంలో నవంబరు 7వ తేదీన ఏపీవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర నోడల్ అధికారిగా భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ ఆర్ మల్లికార్జునరావుని నియమించింది. ఈ ఏర్పాట్ల సమీక్ష కోసం రేపు(మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు అన్ని రాష్ట్రాల నోడల్ అధికారులతో కేంద్రప్రభుత్వం సమావేశం నిర్వహించనుంది. అన్ని రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర సాంస్కృతిక, మంత్రిత్వ శాఖ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కృత్రిమ మేధస్సుతో అడవి ఏనుగుల సమస్య పరిష్కారం: పవన్ కల్యాణ్
మంచి వెనకే చెడు.. అంతా డైవర్ట్ కోసమేనా?.. వర్మ అనుమానాలు
Read Latest AP News And Telugu News