Share News

AP Govt Issues Orders For Quantum Computer: ఏపీలో తొలి ఐబీఎం క్వాంటం కంప్యూటర్‌కు గ్రీన్ సిగ్నల్.. ఉత్తర్వులు జారీ

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:47 PM

అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై సీఆర్డీఏ ఇప్పటికే 50 ఎకరాలు కేటాయించింది.

AP Govt Issues Orders For Quantum Computer: ఏపీలో తొలి ఐబీఎం క్వాంటం కంప్యూటర్‌కు గ్రీన్ సిగ్నల్.. ఉత్తర్వులు జారీ
AP Govt orders for IBM Quantum Computer

అమరావతి, సెప్టెంబర్1, (ఆంధ్రజ్యోతి): అమరావతి (Amaravati) క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ (IBM Quantum Computer) ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) ఉత్తర్వులు జారీచేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై ఇప్పటికే 50 ఎకరాలు కేటాయించింది సీఆర్డీఏ. ప్రభుత్వ సంస్థగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ) ఏర్పాటు చేసింది.


వివిధ రంగాల్లో పరిశోధనలు, యూనివర్సిటీలు, స్టార్టప్‌లు, పరిశ్రమలు వినియోగించుకునేందుకు వీలుగా క్వాంటం వ్యాలీ సేవలు ఉండనున్నాయి. 2 వేల చదరపు అడుగుల్లో 133 క్యూబిట్, 5కే గేట్స్ క్యాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది ఐబీఎం సంస్థ. భద్రమైన నెట్‌వర్కింగ్, అధునాతన కూలింగ్ వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరాను క్వాంటం వ్యాలీకి అందించనుంది ఏపీ ప్రభుత్వం.


చదరపు అడుగుకు రూ.30కే అద్దె చెల్లించే ప్రాతిపదికన రాయితీపై ఐబీఎం సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా నాలుగేళ్ల పాటు ఏడాదికి 365 గంటల ఫ్రీ కంప్యూటింగ్ టైమ్‌ను ప్రభుత్వానికి కేటాయించనుంది ఐబీఎం సంస్థ. ప్రభుత్వ సంస్థలు, విద్య పరమైన అంశాలకుగానూ ఈ కంప్యూటింగ్ టైమ్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. విట్ యూనివర్సిటీ క్యాంపస్‌లో రూ.6 కోట్ల వ్యయంతో మరో చిన్న క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనుంది బెంగుళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ క్యూపై ఏఐ. ఈ మేరకు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు.. నవ్యాంధ్ర ప్రగతికి తొలిబాట వేసిన కార్యశూరుడు: ధూళిపాళ్ల నరేంద్ర

మంత్రి నారా లోకేష్‌కు మరో అరుదైన గౌరవం

For More AP News And Telugu News

Updated Date - Sep 01 , 2025 | 03:19 PM