Share News

CM Chandrababu:అయోధ్యకు సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..

ABN , Publish Date - Dec 27 , 2025 | 06:11 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు సీఎం వెళ్లనున్నారు.

CM Chandrababu:అయోధ్యకు సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..
AP CM Chandrababu Naidu

అమరావతి,డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) రేపు(ఆదివారం) షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. అయోధ్య రామ జన్మభూమిలోని శ్రీ రాముడు దర్శనం చేసుకోనున్నారు సీఎం చంద్రబాబు. మూడు గంటల పాటు అయోధ్యలో శ్రీ రాముని సన్నిధానంలో ఉండనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.


విదేశాలకు సీఎం కుటుంబం..

మరోవైపు.. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం విదేశీ పర్యటనకు వెళ్లనుంది. ఈ నెల 30వ తేదీ ఉదయం విదేశాలకు సీఎం కుటుంబం బయలుదేరనుంది. తిరిగి జనవరి నాలుగో తేదీన రానున్నారు. వ్యక్తిగత పర్యటన కోసం సీఎం చంద్రబాబు విదేశాలకు వెళ్తున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి...

రెచ్చిపోతున్న వైసీపీ శ్రేణులపై పోలీసుల ఉక్కుపాదం

జిల్లాల పునర్విభజనలో కీలక మార్పులకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 27 , 2025 | 06:17 PM