CM Chandrababu On Railway Projects: రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
ABN , Publish Date - Oct 27 , 2025 | 06:15 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీలోని రైల్వే ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రైల్వే ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా రైల్వే ప్రాజెక్టులపై సంబంధిత అధికారులకి కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు.
అమరావతి , అక్టోబరు27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఏపీలోని రైల్వే ప్రాజెక్టుల (Railway Projects)పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే రైల్వే ప్రాజెక్టులపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ(సోమవారం) ఏపీ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రైల్వే ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రైల్వే శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ శ్రీవాస్తవ, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైల్వే ప్రాజెక్టులపై సంబంధిత అధికారులకి కీలక సూచనలు చేశారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి తక్షణం చేపట్టాల్సిన చర్యలు, రైల్వేశాఖ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు సీఎం చంద్రబాబు.
నడికుడి - శ్రీకాళహస్తి, గుంటూరు - గుంతకల్, గుణదల, ముస్తాబాద్ బైపాస్, రాయదుర్గ్ - తుముకూరు మధ్య రైల్వేలైన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షలో చర్చించారు. రాష్ట్రంలో కొత్త రైల్వేలైన్లు, అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి, రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణాలకు సంబంధించి రైల్వేశాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలని పంపించిందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ప్రస్తుతం ఏపీలో పురోగతిలో ఉన్న రూ.33,630 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు చేపట్టాల్సి ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దు.. పాలక మండలి విజ్ఞప్తి
మొంథా తుపానుపై పవన్ కల్యాణ్ అలర్ట్.. అధికారులకు దిశానిర్దేశం
Read latest AP News And Telugu News