AP Government: ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి మార్గదర్శకాలు విడుదల
ABN , Publish Date - Aug 11 , 2025 | 02:46 PM
ఏపీవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. 'స్త్రీ శక్తి ' పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు పేర్కొంది.
అమరావతి, ఆగస్టు11(ఆంధ్రజ్యోతి): ఏపీవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై (AP Free Bus) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. 'స్త్రీ శక్తి ' పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల(ఆగస్టు) 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఐదు కేటగిరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల్లో వెల్లడించింది.
పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ , ఎక్స్‌ప్రెస్, బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు పేర్కొంది. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు బస్సుల్లో తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయొచ్చని సూచించింది. తిరుమల - తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని క్లారిటీ ఇచ్చింది. నాన్ స్టాప్ , ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతరాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
సప్తగిరి ఎక్స్ ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ , ఏసీ బస్సులకు ఉచిత ప్రయాణం పథకం వర్తించదని తేల్చిచెప్పింది. బస్సుల్లో రద్దీ పెరగనున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశించింది. కండక్టర్లకు బాడీ ఒర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేసింది. బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్దేశించింది. తగు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AndhraPradesh News And Telugu News