Share News

CM Chandrababu Review ON Horticultural Crops: ఉద్యాన పంటలకు మద్దతు ధరపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:57 PM

ఉద్యాన పంటలకు మద్దతు ధరపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కఠినంగా వ్యవహారించాలని ఆదేశించారు.

CM Chandrababu Review ON Horticultural Crops: ఉద్యాన పంటలకు మద్దతు ధరపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu Review ON Horticultural Crops

అమరావతి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) ఇవాళ(మంగళవారం) సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్ కె.విజయానంద్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈసందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు.


ఎరువుల లభ్యత, సరఫరా, ఎరువులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కఠినంగా వ్యవహారించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈసారి రెండు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు ఏపీకి వచ్చాయని తెలిపారు అధికారులు. ఈ క్రాప్ ద్వారా ఎంత సాగవుతుంది.. ఎంత వినియోగం జరుగుతుందో లెక్కించాలని సూచించారు. పంటల సాగు, సరఫరా, లభ్యత, వినియోగంపై నిరంతరం పర్యవేక్షించాలని మార్గనిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు.


ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించిన రైతులకు పలు రకాల సబ్సిడీలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఉద్యాన పంటలకు ఆయా పంటల సాగు ఖర్చుల ప్రకారం అన్నదాతలకు మద్దతు ధర దక్కేలా చూడాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. కాఫీ తోటలకు కొత్తగా వచ్చిన తెగుళ్లపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం. కొత్త తెగులు వచ్చిన కాఫీ పంట 20 ఎకరాల్లో ఉందని... వీటిని తొలగించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలకు తెగుళ్లు వ్యాపించకుండా పరిహారం చెల్లించి అయినా తెగులు వచ్చిన పంటను వెంటనే తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్రాభివృద్ధిలో పవన్ కల్యాణ్‌ సహకారం మరువలేనిది: సీఎం చంద్రబాబు

మాదక ద్రవ్య రహిత ఏపీ మా లక్ష్యం: అనిత

For More AP News And Telugu News

Updated Date - Sep 02 , 2025 | 02:09 PM