AP Police VS Perni Nani: వైసీపీకి బిగ్ షాక్.. పోలీసులపై పేర్ని నాని వ్యాఖ్యలు.. కేసు నమోదు
ABN , Publish Date - Aug 22 , 2025 | 09:29 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులపై మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని చేసిన నిరాధారమైన అనుచిత వ్యాఖ్యలను నూజివీడు డీఎస్పీ ఖండించారు. పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామ కొల్లేరు ప్రాంత రైతాంగ పోరాటంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం మారణయుధాలతో కొంతమంది రౌడీ షీటర్లు, బౌన్సర్లను తన ఇంటి వద్ద వైసీపీ నాయకుడు అబ్బాయి చౌదరి ఏర్పాటు చేశారు.
ఏలూరు జిల్లా, ఆగస్టు22, (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులపై (AP Police) మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని (Perni Nani) చేసిన నిరాధారమైన అనుచిత వ్యాఖ్యలను నూజివీడు డీఎస్పీ ఖండించారు. పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామ కొల్లేరు ప్రాంత రైతాంగ పోరాటంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం మారణాయుధాలతో కొంతమంది రౌడీ షీటర్లు, బౌన్సర్లను తన ఇంటి వద్ద ఏర్పాటు చేశారు వైసీపీ నాయకుడు అబ్బాయి చౌదరి.
కొల్లేరు ప్రాంత రైతులతో గ్రామానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులపై ఒక్కసారిగా అబ్బాయి చౌదరి ఏర్పాటు చేసిన బౌన్సర్లు, రౌడీ షీటర్లు విరుచుకుపడ్డారు. ఇరువర్గాల తోపులాటను నిలువరించే ప్రయత్నం చేస్తున్న తమ పోలీసులపై రౌడీ షీటర్లు తిరగబడ్డారని తెలిపారు. బౌన్సర్ల వేషంలో వచ్చి పోలీసు విధులకు అడ్డంకి కలిగించిన ఇరువర్గాలకు చెందిన 9మందిని గుర్తించి కేసులు నమోదు చేశామని నూజివీడు డీఎస్పీ ప్రసాద్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
హిందూ ధర్మంపై విషం చిమ్ముతున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ఆనం ధ్వజం
Read Latest AP News And Telugu News