Share News

Sri Pada Sri Vallabha: శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి భారీ విరాళం

ABN , Publish Date - Dec 04 , 2025 | 08:52 PM

దత్త జయంతి పర్వదినాన పిఠాపురం పట్టణంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. రూ. 2 కోట్ల విలువైన ఇంటి స్థలాన్ని కాకినాడకు చెందిన సి. కుక్కుటేశ్వరరావు ఇచ్చారు.

Sri Pada Sri Vallabha: శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి భారీ విరాళం
Sri pada Sri vallabha Mahasamstanam

కాకినాడ జిల్లా, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): దత్త జయంతి పర్వదినాన పిఠాపురం పట్టణంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి (Sri pada Sri vallabha Mahasamstanam) ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. రూ. 2 కోట్ల విలువైన ఇంటి స్థలాన్ని కాకినాడకు చెందిన సి. కుక్కుటేశ్వరరావు ఇచ్చారు. కాకినాడ పట్టణంలోని రాజా వారికోట ప్రాంతంలో 940 చదరపు గజాల విస్తీర్ణంలో ఓ భవంతిని నిర్మించారు.


ఈ భవంతి ఖర్చు సుమారుగా రూ.2 కోట్ల వరకు ఉంటుంది. ఈ ఇంటినే శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి కుక్కుటేశ్వరరావు అందజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలు తయారు చేయించి ఈరోజు దత్త జయంతి రోజున మహాసంస్థాన ప్రాంగణంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆర్.సౌజన్వకు అందజేశారు. ఈ సందర్భంగా కుక్కుటేశ్వరరావును ఆలయ మర్యాదలతో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఈవో సత్కరించి ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా కుక్కుటేశ్వరరావుకు వేదపండితులు ఆశీర్వచనాలు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి

'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!

పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 04 , 2025 | 09:00 PM