Share News

Tirupati Forest Land Scam: 300 ఎకరాల భూములకు అక్రమ పట్టాలు.. ఏడుగురు అధికారులపై వేటు..

ABN , Publish Date - Oct 16 , 2025 | 09:26 AM

గత వైసీపీ ప్రభుత్వం హయాంలో చెన్నైకు చెందిన వ్యక్తులకు అప్పటి తహసీల్దార్ రామాంజనేయులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సురేష్, వీఆర్వోలు రాఘవేంద్ర, భార్గవ్, గ్రామ సర్వేయర్ వెంకటేష్, వ్యవసాయ/ఉద్యాన ఏంపీఈ పుట్టా పూర్ణచందునాయుడు, కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ పట్టాలు సృష్టించినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Tirupati Forest Land Scam: 300 ఎకరాల భూములకు అక్రమ పట్టాలు.. ఏడుగురు అధికారులపై వేటు..
Land Mafia

తిరుపతి: సత్యవేడు మండలం వానెల్లూరు రెవెన్యూలో అటవీశాఖకు చెందిన 300 ఎకరాల భూములకు అప్పటి తహసీల్దార్ అక్రమంగా పట్టాలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌పై ఆరోపణలు వెల్లువెత్తడంతో.. విచారణ చేపట్టిన అధికారులు తహసీల్దార్ రామాంజనేయులుతో పాటు ఆరుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. అనంతరం వారిపై క్రిమినల్ కేసులు సైతం నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాళ్లోకి వెళ్తే..


గత వైసీపీ ప్రభుత్వం హయాంలో చెన్నైకు చెందిన వ్యక్తులకు అప్పటి తహసీల్దార్ రామాంజనేయులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సురేష్, వీఆర్వోలు రాఘవేంద్ర, భార్గవ్, గ్రామ సర్వేయర్ వెంకటేష్, వ్యవసాయ/ఉద్యాన ఏంపీఈ పుట్టా పూర్ణచందునాయుడు, కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ పట్టాలు సృష్టించినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వాటిని 2014, జూన్ 12న మీ భూమి పోర్టల్లో ఎక్కించిన వైనం. రెవిన్యూ విచారణలో అక్రమంగా పట్టాలించారని పోలీసులు నిర్దారించారు. దీంతో ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్ రామాంజనేయలుతో పాటు జిల్లాలో పని చేస్తున్న 6 మందిపై వేటు పడింది.


ఇవి కూడా చదవండి..

Transgenders Hospitalized in Delhi: ఫినాయిల్ తాగిన 25 మంది ట్రాన్స్‌జెండర్లు

The Central Government Informed: రక్షణ భూముల స్వాధీనానికి మార్గదర్శకాలు ఇవ్వండి

Updated Date - Oct 16 , 2025 | 10:18 AM