Share News

Fake Liquor Case: మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం

ABN , Publish Date - Oct 15 , 2025 | 05:15 PM

మొలకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టై మదనపల్లి జైల్లో రిమాండ్‌లో ఉన్న పదిమంది నిందితులను ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి అనుమతించింది తంబళ్లపల్లి కోర్టు. అయితే, మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.

 Fake Liquor Case: మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం
Fake Liquor Case

చిత్తూరు, అక్టోబరు15 (ఆంధ్రజ్యోతి): మొలకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసు (Molakalacheruvu Fake Liquor Cas)లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టై మదనపల్లి జైల్లో రిమాండ్‌లో ఉన్న పదిమంది నిందితులను ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి అనుమతించింది తంబళ్లపల్లి కోర్టు. అయితే, మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. కోర్టు అనుమతితో రేపు(గురువారం) ఉదయం తమ కస్టడీలోకి తీసుకోనున్నారు ఎక్సైజ్ పోలీసులు.


కాగా, నకిలీ మద్యం తయారీ కేసులో పదిమంది నిందితులని ఈనెల 5వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. వీరిని సమగ్ర విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని వారం రోజులకు ముందే తంబళ్లపల్లె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఇవాళ(బుధవారం) విచారణ అనంతరం మూడు రోజుల కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. ఇప్పటివరకు మొత్తం 23 మందిపై కేసు నమోదు చేయగా.. 15 మంది నిందితులని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో మరో 8 మంది నిందితులు అరెస్ట్ కావాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి...

జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 07:10 PM