Share News

Nara Lokesh: ఆయన ఉన్నంతవరకూ.. మన నేలపై గడ్డి మొక్క కూడా పీకలేరు..

ABN , Publish Date - May 07 , 2025 | 04:12 PM

Nara Lokesh On Operation Sindoor: అర్థరాత్రి వేళ పాక్ గడ్డపై 9 ప్రాంతాల్లో తలదాచుకున్న ఉగ్రమూకలను భారత ఆర్మీ నామరూపాల్లేకుండా చేసింది. పహల్గాం విషాదానికి ప్రతీకారంగా 'ఆపరేషన్ సిందూర్'పేరిట నిర్వహించిన చేపట్టిన చర్యకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తాజాగా ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష స్పందిస్తూ ఎక్స్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు.

Nara Lokesh: ఆయన ఉన్నంతవరకూ.. మన నేలపై గడ్డి మొక్క కూడా పీకలేరు..
Nara Lokesh On Operation Sindoor

Nara Lokesh On Operation Sindoor: పాకిస్థాన్‌ అండ చూసుకుని చెలరేగిపోతున్న ఉగ్రమూకలను మట్టుబెట్టడమే లక్ష్యంగా భారత సైన్యం తొలి అడుగేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా అర్ధరాత్రి వేళ దాయాది దేశంలోని 9 ఉగ్రస్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’(Operation Sindoor) పేరిట నిర్వహించిన ఈ దాడులపై ఏపీ మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh) స్పందించారు. ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేయడాన్ని హర్షిస్తూ ఎక్స్ వేదికగా 54 సెకన్ల వీడియోను ఆయన పోస్ట్ చేశారు.


100 పాకిస్థాన్‌లకు సమాధానం చెప్పే మిసైల్‌..

ఏపీ మంత్రి నారా లోకేష్ ‘ఆపరేషన్‌ సిందూర్‌’(Operation Sindoor)పై స్పందించారు. అమరావతి పునఃప్రారంభోత్సవం సందర్భంగా తన ప్రసంగంలోని కొన్ని మాటలు, నరేంద్ర మోదీ ప్రసంగం, భారత సైన్యం ఉగ్రవాదులపై చేసిన దాడులకు సంబంధించిన దృశ్యాలతో కూడిన 54 సెకన్ల నిడివి గల ఓ వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు.'మన నేల పై మొలిచిన మొక్క కూడా పీకలేరు! వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే మిస్సైల్ పేరు మోదీ' అని ట్యాగ్ చేశారు.

Updated Date - May 07 , 2025 | 04:51 PM