AP Govt: రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీలు, నియామకాలు..
ABN , Publish Date - Aug 06 , 2025 | 03:34 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ గా ఎస్.రవీంద్ర బాబును నియమించింది. అలాగే, వెయిటింగ్‌లో ఉన్న పలువురు అధికారులను కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీలు, నియామకాలు చేపట్టింది. మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ గా ఎస్.రవీంద్ర బాబును నియమించింది. అలాగే, వెయిటింగ్‌లో ఉన్న పలువురు అధికారులను కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాయచోటి మున్సిపల్ కమిషనర్ ఎన్. వాసు బాబును నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ టీపీఆర్వోగా నియమించింది. రాయచోటి మున్సిపల్ కమిషనర్ గా జి. రవి, శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గా పి. భవానీ ప్రసాద్, శ్రీకాకుళం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ సెక్రటరీ గా ఎల్ . సురేష్ లను నియమించింది.
అలాగే సాలూరు మున్సిపల్ కమిషనర్ గా టి.టి.రత్నకుమార్, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ సహాయ కమిషనర్ గా డి. కొండయ్యలను నియమించింది. కదిరి మున్సిపాలిటీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ బి ప్రహ్లాద్ ను కమలాపురం మున్సిపల్ కమిషనర్ పోస్టుకు బదిలీ చేస్తూ.. పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ దిశగా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ను ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒక పార్టీని టార్గెట్ చేస్తారా.. ఎంపీపై సుప్రీం అసహనం, రూ.10 లక్షల జరిమానా
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు
For More National News And Telugu News