BIG BREAKING: జిల్లాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలనం
ABN , Publish Date - Aug 06 , 2025 | 03:07 PM
CM Chandrababu: ఏపీలో కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని జిల్లాలకు పేర్లు మార్చడంతో పాటు పలు నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీన ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమైంది.
అమరావతి, ఆగస్టు 6: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల పేర్లు మార్పు, పలు నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీన ప్రక్రియ ప్రతిపాదనలు నెల రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. గత ప్రభుత్వం సృష్టించిన గందరగోళ పరిస్థితికి త్వరితగతిన తెరదించాలని మంత్రులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. దీనిపై ఇటీవలే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైనందున పని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈనెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు సిద్ధమైంది. అలాగే కొత్త బార్ పాలసీకి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కొత్త బార్ పాలసీలో కల్లుగీత కార్మికులకు 10 శాతం షాపులు కేటాయించనుంది.
సీఎం చంద్రబాబు ఆదేశాలు..
ఉచిత బస్సు ప్రారంభోత్సవంలో మంత్రులందరూ పాల్గొనాలని సీఎం అన్నారు. ఉచిత బస్సు ప్రారంభానికి ముందే ఆటో డ్రైవర్లతో భేటీ కావాలని.. ఆటో డ్రైవర్లతో మాట్లాడి వారికి తగిన సహాయం చేయాలని ఆదేశించారు. కల్లు గీత కార్మికుల షాపుల్లో బినామీలు వస్తే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాల పునర్విభజనలో లోపాలు, సరిహద్దు సమస్యలపై నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వం సృష్టించిన గందరగోళ పరిస్థితికి వెంటనే తెరదించాలని అన్నారు.