Supreme Court Permits Peddareddy: తాడిపత్రికి పెద్దారెడ్డి వెళ్లేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:40 PM
తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఢిల్లీ, ఆగస్టు29 (ఆంధ్రజ్యోతి): తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి (Kethireddy Peddareddy) సుప్రీంకోర్టు (Supreme Court) అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. కేతిరెడ్డి పెద్దారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం.
ఈ సందర్భంగా పెద్దారెడ్డి పిటిషన్‌పై విచారణను ముగించింది సుప్రీంకోర్టు. పెద్దారెడ్డి భద్రతకు అవసరమైన అన్ని ఖర్చులు తామే భరిస్తామని కోర్టుకు చెప్పారు పెద్దారెడ్డి తరపు న్యాయవాదులు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఈ విచారణ ముగించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ క్రీడాకారులకు బంపరాఫర్.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ఆ అధికారిని విమర్శిస్తారా.. భూమన కరుణాకర్ రెడ్డిపై చింతా మోహన్ ఫైర్
For More AndhraPradesh News And Telugu News