Share News

Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి

ABN , Publish Date - Jun 30 , 2025 | 07:53 AM

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు..  ఐదుగురు మృతి
Road Accidents in Telugu states

అన్నమయ్య జిల్లా: రోడ్డు ప్రమాదాల నివారణపై (Road Accidents) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఏదో ఒక ప్రాంతంలో యాక్సిడెంట్లు జరుగుతునే ఉన్నాయి. తమ గమ్యస్థానాలకు త్వరగా వెళ్లాలని కొంతమంది వాహనదారులు మీతిమిరిన వేగంతో వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఆయా ఘటనల్లో పలువురు మృతిచెందుతుండటంతో బాధిత కుటుంబాలు తీవ్ర శోకంలో మునిగిపోతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో (Annamayya District) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలం దొమ్మన బావి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్‌ని లారీ ఢీ కొట్టింది. దీంతో టెంపో ట్రావెలర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది. ట్రాఫిక్‌ను పోలీస్ అధికారులు క్రమబద్దీకరిస్తున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. ఈ విషయం తెలియడంతో కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


బాలానగర్‌లో..

జీడిమెట్ల: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఉషా ఫ్యాన్ కంపెనీ ముందు గల స్తంభాన్ని కారు ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతి చెందిన వ్యక్తి ముస్తాక్(19) అనే యువకుడిగా గుర్తించారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నెల్లూరు: జిల్లాలోని కోవూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వ్యక్తి మృతిచెందాడు. ప్రమాదవశాత్తూ కదులుతున్న లారీ నుంచి జారీ లారీ క్లీనర్ కిందపడ్డాడు. మృతి చెందిన వ్యక్తిని నారాయణగా(45) పోలీసులు గుర్తించారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా కోవూరు నందలగుంట ప్రాంతం వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


రాజేంద్రనగర్‌లో రోడ్డు ప్రమాదం

హైదరాబాద్: రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నమ్మ హోటల్ సమీపంలో ఒకదానికి మరోకటి కార్లు ఢీ కొన్నాయి. వరుసగా తొమ్మిది కార్లు ఢీకొట్టాయి. ఈ ఘటనలో కార్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. స్వల్ప గాయాలతో కార్లలో ప్రమాణిస్తున్న ప్రయాణికులు బయటపడ్డారు. అత్యంత వేగంతో దూసుకొచ్చి సడన్‌గా కారు డ్రైవర్ బ్రేక్ వేశాడు. దీంతో కంట్రోల్ తప్పిన తొమ్మిది కార్లు వరుసగా ఢీ కొన్నాయి. ఈ ఘటనతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్‌ను ఓఆర్ఆర్ సిబ్బందితో పాటు ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేశారు. ట్రాఫిక్ స్థంభించిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్వాంటం వ్యాలీ నేషనల్ వర్క్ షాప్

ఆర్నెల్లలో పోలీసు శాఖలో ఏఐ యాప్‌లు

For More AP News and Telugu News

Updated Date - Jun 30 , 2025 | 09:38 AM