Share News

Pakistan video: పాకిస్థాన్‌కు మద్దతుగా ఓ యువకుడు వీడియో పోస్ట్.. తీవ్ర దుమారం..

ABN , Publish Date - Dec 15 , 2025 | 08:16 AM

అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడు పాకిస్థాన్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు.

Pakistan video: పాకిస్థాన్‌కు మద్దతుగా ఓ యువకుడు వీడియో పోస్ట్.. తీవ్ర దుమారం..
Pakistan Supportive Video

అనంతపురం, డిసెంబరు14 (ఆంధ్రజ్యోతి): నల్లచెరువు మండలంలోని దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ అలియాస్‌ షేక్‌ మహమ్మద్‌ ఆసిఫ్‌.. పాకిస్థాన్‌కు అనుకూలంగా పెట్టిన ఓ వీడియో (Pakistan Video) దుమారం రేపింది. ఇతడు కొన్నేళ్ల క్రితం హిందూ మతం నుంచి ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. సోషల్‌మీడియాలో ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ వీడియోను ఆదివారం పోస్ట్‌ చేశాడు.

దీనిపై మండలానికి చెందిన యువకులు నల్లచెరువు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వీడియో పోస్ట్ చేసిన ధనుంజయ అలియాస్‌ షేక్‌ మహమ్మద్‌ ఆసి‌ఫ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పేదలపై భారం మోపని పన్ను విధానం అవసరం: యనమల

విశాఖ బీచ్ రోడ్డులో ఉత్సాహంగా నేవీ మారథాన్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 15 , 2025 | 05:51 PM