Share News

First Aid Boxes: ఆర్టీసీ బస్సుల్లో దిష్టిబొమ్మలుగా ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు

ABN , Publish Date - Dec 15 , 2025 | 07:59 AM

ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్‌ సీటు వెనుక భాగంలో ‘ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌’ అనేది ఒకటి ఉంటుంది. ప్రయాణం సందర్భంగా బస్సులో ఏదైనా ప్రమాదం జరిగితే.. ప్రథమ చికిత్స అందించడానికి అవసరమైన మందులు ఆ బాక్సులో అందుబాటులో ఉంచాలి.

First Aid Boxes: ఆర్టీసీ బస్సుల్లో దిష్టిబొమ్మలుగా  ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు
First Aid Boxes

  • దిష్టిబొమ్మలు!

  • ఆర్టీసీ బస్సుల్లో ఖాళీగా ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు

  • పట్టించుకోని అధికారులు

పుట్టపర్తి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్‌ సీటు వెనుక భాగంలో ‘ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌’ (First Aid Boxes) అనేది ఒకటి ఉంటుంది. ప్రయాణం సందర్భంగా బస్సులో ఏదైనా ప్రమాదం జరిగితే.. ప్రథమ చికిత్స అందించడానికి అవసరమైన మందులు ఆ బాక్సులో అందుబాటులో ఉంచాలి. ఇందుకోసం బస్సులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు దిష్టిబొమ్మల్లా తయారయ్యాయి. ఎక్కడా ఈ బాక్సుల్లో మందులు అందుబాటులో ఉంచిన దాఖలాలు లేవు. కనీసం కట్టుకట్టడానికి కాటన్‌ లేక హుటాహుటిన ఆసుపత్రులకు పరిగెత్తిన సంఘటనలలు కోకొల్లలు. సత్యసాయి జిల్లాలో ఆరు డిపోలలో 400 బస్సులు ఉన్నాయి. ఇందులో ఆర్టీసీ 280, అద్దె బస్సులు 120 ఉన్నాయి. బస్సుల్లో ఆయా డిపోలలో అధికారులు, అద్దె బస్సులకు యజమానులు ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి.


ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులో ఉండాల్సినవి..

ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులో అత్యవసరమైన మందులు ఉండాలని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఇందులో జ్వరం, దగ్గు, విరోచనాలు, కడుపునొప్పికి అవసరమైన మందులతో పాటు గాయాలైనప్పుడు కట్టుకట్టడానికి దూది, గుడ్డ, అయింట్‌మెంట్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ పెట్టాల్సి ఉంటుంది. ఏ బస్సులోనూ ఇవి కనిపించవు.

నిధుల మాటేమిటి..?

ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సుల్లో మందులకు ఉపయోగించే నిధులు ఏమవుతున్నాయనే దానిపైన ఏ అధికారి వద్ద సమాధానం లేదు. ఫస్ట్‌ ఎయిడ్‌ మాటున లక్షల రూపాయలు నిధులు పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఆయా డిపోలలో డిపో మేనేజర్లు అవసరమైన మందులను కడపజోన్‌ కార్యాలయం వర్క్‌షాపు నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుంది. వీటికి సైతం ఎంత నిధులు ఖర్చు చేస్తున్నది గోప్యమే.


కడప నుంచి మందులు తెప్పిస్తాం

ప్రథమ చికిత్సకు అవసరమైన మందులను కడప జోన్‌ కార్యాలయం నుంచి తెప్పించుకుంటాం. డిపోలో సంస్థ బస్సులు 47, అద్దె బస్సులు 12 ఉన్నాయి. సంస్థ బస్సుల్లో మేమే మందులు పెడుతున్నాం. 2024లో ఒకసారి అవసరమైన మందులకు ఇండెంట్‌ ఇచ్చాం. మందులు అయిపోయిన వెంటనే ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులో పెడుతున్నాం.

-ఇనయతుల్లా, డిపో మేనేజర్, పుట్టపర్తి


ఈ వార్తలు కూడా చదవండి..

పేదలపై భారం మోపని పన్ను విధానం అవసరం: యనమల

విశాఖ బీచ్ రోడ్డులో ఉత్సాహంగా నేవీ మారథాన్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 15 , 2025 | 08:02 AM