Share News

TG Elections: అవినీతి పరులు ఎవరైనా బీజేపీ వదిలిపెట్టదు.. రఘునందన్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Apr 18 , 2024 | 10:19 PM

అవినీతి పరులు ఎవరైనా బీజేపీ వదిలిపెట్టదని మెదక్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్‌రావు (Raghunandan Rao) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మెదక్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ భారీ ర్యాలీ తీశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు హాజరయ్యారు.

TG Elections: అవినీతి పరులు  ఎవరైనా బీజేపీ వదిలిపెట్టదు.. రఘునందన్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్
Raghunandan Rao

మెదక్ జిల్లా: అవినీతి పరులు ఎవరైనా బీజేపీ వదిలిపెట్టదని మెదక్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్‌రావు (Raghunandan Rao) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మెదక్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ భారీ ర్యాలీ తీశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ... మెదక్ జిల్లాలో బీఆర్ఎస్‌కు తెలంగాణ ఉద్యమకారులు ఎవరూ దొరకలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కామారెడ్డిలో ఓడించింది కాశాయపు జెండానే అని చెప్పారు. ఎమ్మెల్సీ కవితను నిజామాబాద్‌లో ఓడిస్తే తీహార్ జైలుకు పోయిందని ఎద్దేవా చేశారు.


CM Revanth Reddy: రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఇదే..

మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి జైలుకు పోయడం ఖాయమని హెచ్చరించారు. వెంకట్రామిరెడ్డి ...పొలిసొళ్లు లేకుండా మల్లన్నసాగర్ ముంపు గ్రామాలకు రా తేల్చుకుందామని సవాల్ విసిరారు. డబ్బులను నమ్ముకొని బీఆర్ఎస్, కులాన్ని నమ్ముకొని కాంగ్రెస్ ప్రలోభాలకు పాల్పడుతుందని విమర్శించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని కారని... మోదీ మూడోసారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. తాను రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ను కాదు..రియల్‌గా ప్రజల కోసం పనిచేసే వ్యక్తినని తెలిపారు. దుబ్బాకలో గెలువని రఘునందన్ మెదక్‌లో గెలుస్తాడని చెప్పారు. ఈ మెదక్ గడ్డ నుంచి కేసీఆర్‌ పార్టీకు గోరికడుతామని వార్నిగ్ ఇచ్చారు.


Supreme Court: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. మరోసారి..

6 గ్యారెంటీలు అమలు చేయాలి: కిషన్‌రెడ్డి

తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా చేసుకొని కుంభకోణాలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ ..అది నేడు లేదు.. రేపు అవసరం లేదన్నారు. కేసీఆర్ ఒక్కరోజు కూడా సెక్రటేరీయట్‌కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.కేసీఆర్‌ను పర్మినెంట్‌గా ప్రజలు ఫామ్ హౌస్‌లో ఉంచారని తెలిపారు. తెలంగాణలో 17 కు 17 ఎంపీ స్థానాలు బీజేపీ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు.


రైతుల రుణమాఫీ ఏమైందని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 6 గ్యారెంటీల సంగతి చెప్పిన తర్వాతనే రేవంత్, రాహుల్‌ గాంధీలు ఓట్లు అడగాలని అన్నారు. కేసీఆర్ కూతురు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి జైలు పాలయిందన్నారు. కేసీఆర్ కూతురు తెలంగాణ పరువు, మహిళల పరువు తీసిందని విమర్శించారు. అవినీతి పరులు ఎవరైనా బీజేపీ వదిలిపెట్టదని హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా తప్పించుకు తిరుగుతున్న కాంగ్రెస్ నేతలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ గడ్డ మీద వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌కు ఒక్క సీటులో కూడా డిపాజిట్ రాదని కిషన్‌రెడ్డి అన్నారు.


Jagadish Reddy: కేసీఆర్ జోలికి వస్తే తన్ని తరిమేస్తామన్న మాజీ మంత్రి

కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడి చేస్తోంది: గోవా సీఎం ప్రమోద్ సావంత్

10 ఏళ్లలో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను దోపిడీ చేశారని.. నేడు కాంగ్రెస్ దోపిడీ చేస్తోందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ (CM Pramod Sawant) అన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి అంతా కేంద్రం నిధులతో జరిగిందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెడ్డిని కలెక్టర్ నుంచి ఎమ్మెల్సీగా చేశారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దోపిడీ చేస్తుందన్నారు. మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.


హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌ను ఇంటికి పంపాలని హెచ్చరించారు. వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ కోసం బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఒకే దేశం ఒకే ఎన్నిక బీజేపీ నినాదమన్నారు. పదేళ్లుచూసింది ట్రెలర్ మాత్రమేనని అసలు సినిమా ముందుందని తెలిపారు.దేశంలో మోదీ ప్రభుత్వం రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిపించాలని సీఎం ప్రమోద్ సావంత్ కోరారు.


Loksabha polls: కాసేపట్లో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులకు బీఫారమ్ ఇవ్వనున్న కేసీఆర్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 18 , 2024 | 10:54 PM