Share News

Harish Rao: సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్

ABN , Publish Date - Mar 07 , 2024 | 01:14 PM

Telangana: సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ వెనుకబాటు తనానికి కారణం నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలన అని అన్నారు. రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని.. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలన్నారు.

Harish Rao: సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్

సంగారెడ్డి, మార్చి 7: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (MLA Harish Rao) తీవ్రంగా ఖండించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ వెనుకబాటు తనానికి కారణం నాటి టీడీపీ (TDP), కాంగ్రెస్ (Congress) పాలన అని అన్నారు. రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును (TDP Chief Chandrababu naidu) తిట్టాలని.. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలన్నారు. చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలుగా మారాయని.. పాలమూరు వలసలకు కారణం ఆ రెండు పార్టీలే అని విమర్శించారు. గత పార్టీలు ప్రాజెక్టుల పేర్లు మార్చారు తప్ప పనులు పూర్తి చేయలేదన్నారు. తాము పెండింగ్ ప్రాజెక్టును రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని.. అలాంటి కేసీఆర్‌ను తిట్టడం అవివేకం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

AP News: జగన్ పర్యటన.. ప్రజల ఆవేదన.. ఏం జరిగిందంటే?


‘‘పేగులు మెడలో వేసుకొని రాక్షసులు తిరుగుతరు. ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా పడిగట్టు పదాలు, పరుష పదజాలంతో పరిపాలన సాగదు. ప్రతిపక్షంలో ఉన్నట్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదు. మంచిపేరు తెచ్చుకోవాలంటే వల్గారిటీ కాదు.. చిల్లర మల్లర భాష మాట్లాడి పదవి గౌరవం తగ్గించుకోవద్దు. తన ఎత్తు గురించి ఆయన మాట్లాడుతరు. నేను అలా మాట్లాడి విలువ తగ్గించుకోను. కుసంస్కారంగా మాట్లాడటం వల్ల విలువ దిగజారుతుంది. ఎంత ఎత్తు ఉన్నమన్నది కాదు, ప్రజల కోసం ఎంత గట్టిగా పని చేసినం అన్నది ముఖ్యం. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నడు. పాలమూరు వలసలు వాపస్ చేసింది కేసీఆర్. తన తండ్రి చనిపోతే స్నానం చేసేందుకు నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని వెళ్లినా అని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ సమయంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాదా. పాలమూరు ప్రాజెక్టులను కాగితాలకు పరిమితం చేసింది కాంగ్రెస్ కాదా? పాలమూరు కరువుతో రాజకీయాలు చేసింది కాంగ్రెస్, టీడీపీ’’ అంటూ విరుచుకుపడ్డారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ పోటీ చేసేది ఎక్కడ అంటే..? ఆ రెండు చోట్లేనా..!!



వలసలు, రైతు ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్....

‘‘కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను నాడు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలేదు.1984లో కల్వకుర్తికి కొబ్బరికాయ కొట్టి 2014 వరకు 13వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కానీ మేము పదేండ్లలోనే 2600 కోట్లు ఖర్చు చేసి 3 లక్షల 7వేల ఎకరాలకు నీళ్లు అందించాం. నెట్టంపాడు 2300 ఎకరాలకు నీళ్లు ఇస్తే మేము 540 కోట్లు ఖర్చు పెట్టి లక్షా 40వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. బీమా కింద 12వేల ఎకరాలకు మీరు నీళ్లు ఇస్తే 646 కోట్లు ఖర్చు చేసి లక్షా 60వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. కోయిల్ సాగర్ పనులు పూర్తి చేసి 32 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చాం. ఈ నాలుగు ప్రాజెక్టుల కింద ఆరున్నర లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చాం. వలసలు, రైతు ఆత్మహత్యలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. బొంబాయి బస్సులు బంద్ అయ్యేలా చేసింది బీఆర్ఎస్ పార్టీ. వాస్తవాలు కప్పి పెట్టి కేసీఆర్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నడు రేవంత్ రెడ్డి. పాలమూరు ప్రాజెక్టు 80శాతం అయ్యింది. కాల్వలు పూర్తి చేసి నీళ్లు ఇవ్వండి. పాలమురులో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. 60 ఏండ్ల మీ పాలనలో ఒక్క కాలేజీ ఏర్పాటు చేయలేదు. చిత్తశుద్ధి ఉంటే ఆరు నెలల్లో నీళ్ల వాటా తేల్చే ప్రయత్నం చేయండి. మేము పోరాటం చేసి కొత్త ట్రిబ్యునల్ ఏర్పడేలా చేశాం. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ప్రజలను దృష్టి మరల్చే యత్నం సరికాదు. ఓట్లు సీట్లే కాదు నిజాయతీగా పని చేయాలి’’ అంటూ హరీష్‌రావు హితవుపలికారు.

ఇవి కూడా చదవండి..

Kishan Reddy: తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉంది.. 17 స్థానాలు టార్గెట్

Malkajgiri MLA: మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 07 , 2024 | 01:14 PM