Share News

Harish Rao: దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్టుగా సర్కారు తీరు..

ABN , Publish Date - Apr 02 , 2024 | 01:09 PM

Telangana: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ నీటి నిర్వహణ, విద్యుత్ వైఫల్యమే పంట నష్టానికి కారణమని ఆరోపించారు. మంగళవారం రాష్ట్రంలో ఎండిన పంటలకు ఎకరాకు 25 వేలు నష్టపరిహారం, పంటలకు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్‌కు హరీశ్‌రావు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరువును నివారించే ప్రయత్నలు ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు.

Harish Rao: దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్టుగా సర్కారు తీరు..

సిద్దిపేట, ఏప్రిల్ 2: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై (Congress Government) మాజీ మంత్రి హరీశ్‌రావు (Former Minister Harish Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ నీటి నిర్వహణ, విద్యుత్ వైఫల్యమే పంట నష్టానికి కారణమని ఆరోపించారు. మంగళవారం రాష్ట్రంలో ఎండిన పంటలకు ఎకరాకు 25 వేలు నష్టపరిహారం, పంటలకు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్‌కు హరీశ్‌రావు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరువును నివారించే ప్రయత్నాలు ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కులు మోరిగినట్లుగా ఉంది సర్కారు తీరు అంటూ విరుచుకుపడ్డారు. కేసీఆర్ పొలం బాట పట్టాకే సర్కారు పంటల విషయంలో కళ్ళు తెరిచిందన్నారు. బీఆర్‌ఎస్ (BRS) పోరాటాల వల్ల రైతులకు కొంత ఊరట దక్కిందన్నారు. వడగళ్ళు, ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వంద రోజుల్లో చేస్తానన్న హామీలు వెంటనే అమలు చేయాలన్నారు. ఎలక్షన్ కోడ్ ఉందని ఉత్తమ్ చావు కబురు చల్లగా చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను దగా చేసింది కాంగ్రెస్ అని.. వంద రోజుల తరువాతే కోడ్ వచ్చిందని బీఆర్‌ఎస్ నేత తెలిపారు.

AP Elections: రాజానగరం 'రాజు' ఎవరు..?


ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చింది..

పంటలకు ఇస్తామన్న బోనస్ యాసంగి పంటలకు ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు. ఎకరాకు 15 వేలు రైతులకు, కౌలు రైతులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడుగడుగునా రైతులకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి ఉండాలన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా లేకున్నా తమది ఎప్పుడూ రైతు పక్షమే అని స్పష్టం చేశారు. రైతుల పక్షాన కేసీఆర్ మాట్లాడితే కాంగ్రెస్ నేతలు ముప్పేట దాడికి దిగుతున్నారన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిందని వ్యాఖ్యలు చేశారు. కూడవెల్లి వాగులోకి తక్షణమే నీళ్ళు విడుదల చేయాలన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఎకరా ఎండలేదని.. కాంగ్రెస్ వచ్చాకే పంటలు ఎండుతున్నాయన్నారు. నీళ్ళు ఉండగా ఇవ్వకుండా పంటలు ఎండగడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. 24 గంటల్లో కూడవెల్లికి నీళ్ళు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని.. మల్లన్నసాగర్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. భట్టి ఒట్టి మాటలు కట్టిపెట్టలని హితవుపలికారు. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వాలన్నారు. తక్షణమే రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

Kavya: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తోనే పోటీ: కడియం కావ్య


ఎలాంటి చర్చకైనా సిద్ధం...

ముఖ్యమంత్రి బోగస్ మాటలు మాట్లాడుతున్నారని.. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బీఆర్‌ఎస్‌ను విమర్శించే హక్కు లేదన్నారు. దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమలును విస్మరించిందన్నారు. కాంగ్రెస్ హామీల విషయంలో ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు వచ్చిన సరే అని అన్నారు. పంటలు ఎండుతుంటే వికృతానందం పొందుతున్నది కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక నీరు తగ్గి రైతుల్లో కన్నీళ్లు పెరిగాయ్యారు. దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతుల ఆత్మహత్యలను కూడా జోకులు వేస్తున్నారని మండిపడ్డారు. విపక్ష నాయకుల ఇళ్లలోకి వెళ్లి పార్టీలో చేర్చుకునే శ్రద్ద రైతులకు నీళ్ళు ఇవ్వడంలో లేదన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం రాజకీయాలు మాని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘రైతులకు మేలు చేస్తే మేము అడ్డుకోం.. మీలాగా ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయం’’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

Hyderabad: గండిపేట కాలువకు గండి.. వృథాగా పోతున్న తాగునీరు

YS Sunitha: షర్మిలపై ఇంట్రెస్టింగ్.. జగన్‌పై షాకింగ్ కామెంట్స్


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 02 , 2024 | 01:09 PM