Share News

YS Sunitha: షర్మిలపై ఇంట్రెస్టింగ్.. జగన్‌పై షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:57 AM

వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలి.. అవినాష్ రెడ్డిని ఓడించడమే తన లక్ష్యం.. వీలైతే జగన్‌ను ఓడించాలి.. ప్రస్తుతానికి ఇదే తన లక్ష్యం అంటూ వైఎస్ సునీత వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలుసునని, ప్రజలు చాలా తెలివైన వారని, ప్రతిసారీ మోసపోరని ఆమె అన్నారు.

YS Sunitha: షర్మిలపై ఇంట్రెస్టింగ్.. జగన్‌పై షాకింగ్ కామెంట్స్

కడప: ‘ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వైసీపీ (YSRCP)ని అధికారంలోకి రాకుండా చేయాలి. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి (Avinash Reddy)ని ఓడించడమే నా లక్ష్యం.. వీలైతే వైఎస్ జగన్‌ (YS Jagan)ను ఓడించాలి.. ప్రస్తుతానికి ఇదే నా లక్ష్యం అంటూ వైఎస్ సునీత (YS Sunitha) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు సునీత కడపలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకా (YS Viveka)ను ఎవరు హత్య (Murder) చేశారో ప్రజలకు తెలుసునని, ప్రజలు చాలా తెలివైన వారని, ప్రతిసారీ మోసపోరని అన్నారు. నిజమేంటో ప్రజలకు బాగా తెలుసునని, ప్రతిసారి ఎవరూ అందరినీ మోసం చేయలేరని అన్నారు. ఏం జరిగిందో కడప ప్రజలకు అంతా తెలుసునని, అన్న సీఎం జగన్‌ కడప ప్రజల్లో మనిషే కదా?.. ఆయనకు అంత భయమెందుకు? వారు ఎందుకు భయపడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని, మీరు ఎక్కడ చెబితే అక్కడ చర్చకు సిద్ధమని, సాక్షి చానల్‌కు రమ్మన్నా చర్చకు వస్తానని సునీత స్పష్టం చేశారు.

ఎన్నికల ముందు వైసీపీకి మరో బిగ్ షాక్..

sunitha.jpg

షర్మిలకు ఫుల్ సపోర్టు!

ఎంపీగా పోటీ చేయాలని వివేకా శాయశక్తులా కృషి చేశారని, ఆ ప్రయత్నంలోనే హత్యకు గురయ్యారని వైఎస్‌ సునీత అన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) ఎంపీగా పోటీ చేస్తారని.. తన తండ్రి కూడా అదే కోరుకున్నారన్నారు. షర్మిల పోటీ చేయడం అభినందించదగ్గ విషయమని, వైసీపీ కోసం షర్మిల ఎంతో కష్టపడిందని, జగన్ జైలు నుంచి బయటకు వచ్చాక షర్మిలకు భయపడి ఆమెను దూరం పెట్టారన్నారన్నారు. షర్మిలకు రాజకీయ సపోర్ట్‌ లేకుండా ఉండేందుకే వివేకాను హత్య చేశారా? లేక ఇంకేమైనా కారణాలున్నాయా? .. వాస్తవాలన్నీ బయటకు రావాలని సునీత అన్నారు.

ys sharmila-jagan.jpg

ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమైన టీడీపీ మహిళా నేత!

వివేకం మూవీపై..

‘వివేకం’ సినిమా ఎవరు తీశారో తనకు తెలియదని, చాలా ధైర్యంగా తీశారని వైఎస్ సునీత అన్నారు. సినిమాలో చూపించిన దానికంటే ఇంకా ఘోరంగా తన తండ్రిని హత్య చేశారన్నారు. హత్యా రాజకీయాలకు చోటు ఉండకూడదని, ఈ ప్రభుత్వం మళ్లీ వస్తే రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే తాను ముందుకు వచ్చానని సునీత స్పష్టం చేశారు.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 12:40 PM