Share News

TG Politics: రేవంత్‌రెడ్డి పొంకనాల పోశెట్టి.. కేటీఆర్ సెటైర్లు

ABN , Publish Date - Apr 02 , 2024 | 05:25 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లటం పక్కా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. మంగళవారం నాడు మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సభలో కేటీఆర్ పాల్గొని సీఎం రేవంత్‌రెడ్డి, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

TG Politics: రేవంత్‌రెడ్డి  పొంకనాల పోశెట్టి.. కేటీఆర్ సెటైర్లు

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లటం పక్కా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) అన్నారు. మంగళవారం నాడు మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సభలో కేటీఆర్ పాల్గొని సీఎం రేవంత్‌రెడ్డి, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లే మొట్ట మొదటి వ్యక్తి జంపింగ్ జపాంగ్ రేవంత్ రెడ్డే అని ఎద్దేవా చేశారు. ఈ విషయం మీద ఎందుకు రేవంత్ స్పందిచట్లేదని ప్రశ్నించారు.

ఆయన జేబుదొంగ మాదిరిగా జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారని సెటైర్లు గుప్పించారు. మెడల పేగులు వేసుకొని తిరిగేటోడు ముఖ్యమంత్రా? అని ఎద్దేవా చేశారు. ఆయన ప్రభుత్వాన్ని పడగొడితే మానవబాంబు అవుతాడంటా అని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఆయన పక్కనే నల్గొండ, ఖమ్మం మానవబాంబులే ఆయన్ని కూలగొడుతాయన్ని హెచ్చరించారు. రేవంత్ 5 ఏళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని తాము కోరుకుంటున్నామన్నారు.

Big Breaking: కల్వకుంట్ల కుటుంబాన్ని వెంటాడుతున్న అరెస్టులు!


దమ్ముంటే రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనీ నెరవేర్చాలని సవాల్ విసిరారు. రుణమాఫీ చేస్తానన్న పొంకనాల రెడ్డి...రేవంత్ రెడ్డి ఎక్కడ? అని నిలదీశారు. రుణమాఫీ అయినవాళ్లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని... మిగతా వాళ్లు బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. మల్కాజ్‌గిరిలో బీజేపీతోనే బీఆర్ఎస్‌కు పోటీ అని చెప్పారు. పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు చేసిందేమిటీ? అని ప్రశ్నించారు.

మాజీమంత్రి ఈటల రాజేందర్ దమ్ముంటే మోదీ మల్కాజ్‌గిరికి ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని అన్నారు. జై శ్రీరామ్ పేరుతో రాజకీయాలు చేయటమే బీజేపీకి తెలుసని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేయలేదని మాట్లాడుతున్నందుకు ఈటల రాజేందర్‌కు సిగ్గు అనిపించట్లేదా అని దెప్పిపొడిచారు. ఏం మొఖం పెట్టుకొని ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు అడుగుతాదో ఈటల చెప్పాలని ప్రశ్నించారు.

CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల్లో కుట్రకు తెరదీసిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమో చౌకిదార్ చోర్ హై అంటాడన్నారు. రేవంత్ ఏమో మోదీ హమారా బడే భాయ్ అంటారని సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ అదానీ ఫ్రాడ్ అంటే రేవంత్‌రెడ్డి అదానీ తన ఫ్రెండ్ అంటాడన్నారు. రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కాం ఏం లేదంటాడు. కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయమని అంటాడని.. కానీ రేవంత్ మాత్రం ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కరెక్టే అంటాడని చెప్పారు. రేవంత్ రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా? మోదీ కోసం పనిచేస్తుండా ? అని ప్రశ్నించారు. మహిళలకు రేవంత్ రూ. 2500 ఇస్తా అన్నాడని ఎవరికైనా వచ్చాయా? అని నిలదీశారు.


రైతులు, ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేరన్నారు. ఏప్రిల్ 1వ తేదీన గ్రూప్ 2 నోటిఫికేషన్ వేస్తామని సీఎం రేవంత్ అన్నారని.. ఎందుకు నోటిఫికేషన్ వేయట్లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యాయిని... బావుల కాడా పండుకునే రోజులు మళ్లా వచ్చాయని మండిపడ్డారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పును పార్లమెంట్ ఎన్నికల్లో జరగనీయకుండా చూసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో సెక్యులర్ పార్టీ ఉందంటే అది బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. ఉద్వేగాలు కాదని.. ఉద్యోగాలు ఇచ్చే వారిని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Harish Rao: దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్టుగా సర్కారు తీరు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 05:51 PM