Share News

KTR: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్... కేటీఆర్ విసుర్లు

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:44 PM

పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీజేపీ పార్టీలో చేరబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్‌లో మంగళవారం నాడు ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలపై బీఆర్ఎస్ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికలు పార్టీ భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నికలని చెప్పారు.

KTR: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్... కేటీఆర్ విసుర్లు

ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీజేపీ పార్టీలో చేరబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్‌లో మంగళవారం నాడు ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలపై బీఆర్ఎస్ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికలు పార్టీ భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నికలని చెప్పారు.


MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మరోసారి చుక్కెదురు.. అప్పటివరకు!

ఈ ఎన్నికల్లో గెలిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 6 గ్యారెంటీలపై ప్రశ్నించే అవకాశం ఉంటుందని అన్నారు. జిల్లాలో త్రిముఖ పోటీ ఉండబోతోందన్నారు. కార్యకర్తలు కష్టపడితే విజయం తమదేనని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే సీఎం రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కొంత మంది బీఆర్ఎస్ నేతలు స్వార్థంతో పదవుల కోసం కాంగ్రెస్‌లోకి వెళ్లి పోతున్నారని మండిపడ్డారు. కార్యకర్తలు మాత్రం పార్టీతోనే ఉన్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు.


Telangana: నల్గొండలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మార్పు.. కొత్తగా ఎవరంటే?

ఎక్కడ పోగుట్టుకున్నదాన్ని అక్కడే వెతుక్కోవాలని చెప్పారు. రేవంత్ రెడ్డి ఓ ముఖ్యమంత్రిలా వ్యవహరించడం లేదని ధ్వజమెత్తారు. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఆయనే 5 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపి,420 హామీలు అమలు చేయాలని అన్నారు.

అధికారం రాగానే మన దగ్గరకు వచ్చిన వాళ్లే... అధికారం పోయిన తర్వాత వెళ్లి పోయారన్నారు. ఇప్పుడు పార్టీలో మిగిలింది నిఖార్సై నా కార్యకర్తలేనని చెప్పారు. అందర్నీ కడుపులో పెట్టుకుని చూసుకుంటానని మాటిచ్చారు. ప్రధాని మోదీ కోసం రేవంత్ పని చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. 20, 25మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారని ఆరోపించారు.


ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్, బీజేపీ వ్యక్తో మైనార్టీలు గుర్తించాలని అన్నారు. బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. తాము బీజేపీకి బీ టీమ్ అయితే బీజేపీ నేతలు ఈటల రాజేందర్‌, బండి సంజయ్, అర్వింద్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించింది ఎవరని ప్రశ్నించారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని గుర్తుచేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మాయమయ్యే ప్రమాదం ఉందని కేటీఆర్ హెచ్చరించారు.


Akbaruddin Owaisi: మా బ్రదర్స్‌ను చంపాలని చూస్తున్నారు.. అక్బరుద్దీన్ సంచలనం!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 16 , 2024 | 03:56 PM