Share News

Telangana: నల్గొండలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మార్పు.. కొత్తగా ఎవరంటే?

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:50 PM

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 18న ప్రారంభమవుతుంది. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి, ప్రచారాన్ని ప్రారంభించాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్‌ఎస్, బీజేపీ అన్ని స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా నల్గొండ ఎంపీ అభ్యర్థిని..

Telangana: నల్గొండలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మార్పు.. కొత్తగా ఎవరంటే?

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు(Lok Sabha Elections) నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 18న ప్రారంభమవుతుంది. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి, ప్రచారాన్ని ప్రారంభించాయి. అయితే కాంగ్రెస్ (Congress) మాత్రం ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్‌ఎస్, బీజేపీ అన్ని స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా నల్గొండ ఎంపీ అభ్యర్థిని బీఆర్ఎస్ మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


క్షేత్రస్థాయిలో పరిస్థితుల ఆధారంగా ఇక్కడి అభ్యర్థి కొంత బలహీనంగా ఉన్నారని, అభ్యర్థిని మారిస్తేనే పోటీలో ఉండగలుగుతామని బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో నల్గొండ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించారు. ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ నిర్వహించిన సర్వేలో కృష్ణారెడ్డి వెనుకపడ్డారని తెలుస్తోంది. ఆయన ఏకంగా మూడో స్థానంలో ఉన్నారని.. ఇలా అయితే ఈ నియోజకవర్గంలో పోటీ ఇవ్వలేమని, అభ్యర్థిని మారిస్తే పోటీలో ఉండొచ్చనే ఆలోచన గులాబీ బాస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


Hyderabad: ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‏కు బిగ్ షాక్.. సీనియర్‌ నేత సోమన్‌ రాజీనామా

నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కృష్ణారెడ్డి స్థానంలో మాజీ ఎమ్మెల్సీ తెరా చిన్నప్పరెడ్డిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థి మార్పుపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.చిన్నప్పరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారా లేదా ఇంకా ఎవరినైనా కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకువస్తారా అనేది తెలియాల్సి ఉంది.


బీజేపీపై జనంలో మౌన వ్యతిరేకత

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 16 , 2024 | 03:00 PM